కొత్తిమీర వడలు


కావల్సినవి:  
బియ్యంపిండి - ఒకటిన్నర గ్లాసు, సన్నగా తరిగిన కొత్తిమీర - కప్పు, గోరువెచ్చటినీరు - గ్లాసు, పచ్చిమిర్చి - పన్నెండు, ఉప్పు - ఒకటిన్నరచెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ:
ఓ పాత్రలో నీరు తీసుకుని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని కొంచెం మరిగాక బియ్యంపిండి వేసి కలిపి మూతపెట్టాలి. పిండి పూర్తిగా ఉడికాక దింపి.. దానిని వెడల్పాటి పళ్లెంలోకి మార్చి ఆరనివ్వాలి. అందులో కొత్తిమీర తురుము వేసి కలపాలి. అది ఆరాక.. చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వెడల్పాటి కంచం తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి.. ఈ ఉండల్ని అందులో దొర్లించాలి. ఇప్పుడు ఓ ప్లాస్టిక్‌ కవరుకు నూనె రాసి దానిపై ఒక్కో ఉండను ఉంచి.. వడలా అద్ది కాగుతున్న నూనెలో వేయించాలి. అంతే కమ్మని కొత్తిమీర వడలు సిద్ధం. ఇవి రెండురోజుల దాకా నిల్వ ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top