వేసవికాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు

వేసవి కాలం వచ్చేసింది. వడదెబ్బ తగలకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే వేసవికాలంలో ఆహారం విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కువ నీరు
దాహం వేసినపుడే నీళ్లు తాగుదాం అనే ఆలోచన వేసవిలో పనికి రాదు. దాహం వేసినా, వేయకపోయినా వీలైనంత ఎక్కువ నీటిని తాగేయాలి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఇది బాగా ఉపకరిస్తుంది. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకుంటే మరీ మంచిది.

తాజా పళ్లు, కూరగాయలు
వేసవికాలంలో మెనూలో పళ్లు తప్పకుండా ఉండాలి. రోజూ ఏవైనా రెండు రకాల పళ్లను తీసుకోవాలి. వాటర్‌మెలన్, పైనాపిల్, ఆపిల్, సపోటా, బత్తాయి వంటి పళ్లను తీసుకుంటే మంచిది. పళ్లను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇష్టమైన వారు సలాడ్స్ తినొచ్చు. తాజా కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

భోజనం మరవద్దు
స్థూలకాయంతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం భోజనం చేయడం మానేస్తుంటారు. భోజనం మానేయడం వల్ల శరీర జీవనక్రియలు కుంటుపడతాయి. శరీరం తక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కాబట్టి భోజనం మానేయవద్దు. తక్కువ ఆహారాన్ని తీసుకున్నా సమయానికి తీసుకోవడం మరవద్దు.
 

పెరుగు
భోజనంలో పెరుగు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వేసవి కాలంలో బట్టర్‌మిల్క్ తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇందులో పుదీనా కలుపుకుంటే మరీ మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సివచ్చినపుడు ఒక గ్లాసు బట్టర్‌మిల్క్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top