పదేళ్ల ముందే షుగర్ వ్యాధికి చెక్!

చాప కింద నీటిలా వచ్చి ఎప్పుడో హఠాత్తుగా బయటపడే మధుమేహాన్ని ఇక పదేళ్ల ముందే కనుక్కోవచ్చు. చిన్న రక్త పరీక్ష ద్వారా పదేళ్ల తరువాత మధుమేహం వచ్చే అవకాశాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌కి చెందిన పరిశోధకులు. కొన్ని రకాల అమైనో ఆమ్లాలను పరీక్షించడం ద్వారా ఇది సాధ్యపడుతుందంటున్నారు.

  శరీరం నిర్వర్తించే జీవక్రియలన్నీ సజావుగా సాగుతుంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. ఏమాత్రం తేడా కలిగినా అనారోగ్యం వస్తున్నట్టే. మధుమేహం లాంటి పెద్ద జబ్బులు వచ్చినప్పుడు కూడా మన శరీరం లోపల రకరకాల మార్పులు కలుగుతాయి. ఇవన్నీ కణస్థాయిలో, జీవక్రియల ప్రాథమిక స్థాయిలో జరుగుతాయి కాబట్టి వెంటనే గుర్తించలేం. ఇలా ప్రాథమిక స్థాయి మార్పుల్ని గుర్తించగలిగితే ఏ వ్యాధినైనా చాలా ముందుగా గుర్తించడం సాధ్యమవుతుంది. మధుమేహం విషయంలో ఐసోల్యూసిన్, ల్యూసిన్, వేలైన్, థైరోసిన్, ఫినైల్ అలనిన్ అనే ఐదు రకాల అమైనో ఆమ్లాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

ఈ అమైనో ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే మధుమేహం వచే ్చ అవకాశాలు ఎక్కువ అని అర్థం. 2వేల 4 వందల మందిపై 1991లో పరిశోధన మొదలుపెడితే వారిలో 2 వందల మంది ఈ పది, పన్నెండేళ్లలో మధుమేహం బారిన పడ్డారు. 61 రకాల మెటబొలైట్స్‌ను గణించడం ద్వారా వీరికి మధుమేహం అవకాశాలున్నట్టు కనుక్కోగలిగారు. ఈ పరిశోధన వల్ల మధుమేహం అవకాశాన్ని ముందుగానే గుర్తించి అది మనపై దాడిచేసే లోపలే జీవనవిధానాన్ని మార్చుకోగలం. దీనివల్ల మధుమేహ నివారణ మరింత సులువు అవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top