ఇక మాట్లాడే క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయి చూడండి....

మీకు క్రెడిట్ కార్డు ఉందా? అయితే.. దాంతో ఖర్చుపెట్టడం గురిం చి బాగానే అవగాహన ఉం టుంది. ఒకటి రెండుసార్లు షా పింగ్ చేయగానే ఎంత ఖర్చయిందోనని భయం ఉంటుంది. రికార్డు దగ్గర ఉంచుకోకపోతే.. ఆన్‌లైన్ ఎక్కౌంట్‌లో చూసుకునే వరకూ లేదా స్టేట్‌మెంట్ వచ్చే వరకూ టెన్షన్‌గానే ఉంటుంది. అయితే.. ఇప్పుడా స మస్య తొలగిపోయేలా.. మిమ్మల్ని హెచ్చరించేలా కొత్త కార్డులు రానున్నాయి. ఇవి మాట్లాడతాయి కూడా. మీరు దానితో ఖర్చు పెట్టగానే ఎంత ఖర్చుపెట్టారో, ఇంకా ఎంత లిమిట్ ఉందో డిస్‌ప్లే ఇవ్వడంతో పాటు మాటల ద్వారా చెబుతుంది కూడా. దీన్ని క్రెడిట్ కార్డు అని లే దా రివార్డు కార్డు అని కూడా పిలవొచ్చు.

ఎందుకంటే.. ఈ కార్డు మీది బటన్ల ద్వారా మీరు మీ రివార్డు పాయింట్లు కూడా ఖర్చుపెట్టుకోవ చ్చు. పైగా.. మీరు ఖర్చుపెట్టగానే, ఎంత ఖర్చు పెట్టారో.. ఇంకా క్రెడి ట్ లిమిట్ ఎంతుందో తెలిపే విధంగా డిస్‌ప్లే వస్తుంది. ఇందుగ్గానూ ఈ కార్డులో నీటి పొర అంత పలుచగా మైక్రో ప్రాసెసర్లను ఏర్పాటు చేశారు. పైగా ఇది ప్రస్తుత కార్డుల కంటే మరింత భద్రం కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ కార్డు పోయిందంటే.. దాన్ని బ్లాక్ చేయకపోతే ఎవరైనా వాడొచ్చు. 

అయితే.. డైనమిక్స్ ఇన్‌కార్పొరేషన్ తయారు చేసే కొత్త రకం కార్డులో పాస్‌వర్డ్ లాంటి సెక్యూరిటీ వర్డ్ పెట్టుకునే వీలుంటుంది. దాంతో కార్డు పని చేయకుండా లాక్ చేయొచ్చ. క్రెడిట్ కార్డు వాడేటప్పుడు దాన్ని అన్‌లాక్ చేసి మళ్లీ లాక్ చేయొచ్చు. మీ కార్డు లాక్ అయినప్పుడు పోయిందనుకోండి.. సెక్యూరిటీ వర్డ్ లేకుండా దాన్ని వాడలేరు కాబట్టి మీరు భయపడనక్కరలేదు. తాపీగా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్ ద్వారా మన బ్యాంక్ ఎక్కౌంట్ లేదా క్రెడిట్ కార్డు ఆపరేట్ చేసే అవకాశం ఉన్నా అమెరికా, జపాన్ దేశాల్లో కూడా ఈ సౌకర్యాన్ని జనం ఉపయోగించుకోవడం లేదు. అందుకే డిస్‌ప్లేతో పాటు ఇతర సౌకర్యాలు కలిగిన కార్డులను అమెరికాలో ఈ ఏడాది చివర్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 2జీ కార్డు పేరిట ఈ సౌకర్యాలున్న కార్డులను సిటి బ్యాంక్ విడుదల చేసింది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top