గోల్డెన్‌ మంచూరియా


కావలసిన పదార్ధాలు
క్యాలీఫ్లవర్‌ - 1
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఉల్లిపాయలు- 3
పచ్చిమిర్చి- 8
కారం- 5 చెంచాలు
నూనె- 2 టేబుల్‌ స్పూన్లు
ధనియాల పొడి - 1 చెంచా
మిఠాయి రంగు - 1 టీ స్పూన్‌
తయారు చేసే విధానం
క్యాలీఫ్లవర్‌ను సన్నగా తరిగి కొద్దిగా ఉప్పు, పసుపు ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి బాగా మెత్తగా మగ్గని వ్వాలి. నీళ్ళలో కొద్దిగా మిఠాయిరంగు వేసుకోవాలి (ఆరంజ్‌ కలర్‌). చల్లారి న తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగుతుండగా ఈ ఉండలు కూడా వేసుకొని కారం ధనియాల పొడి వేసి బాగా నూనెలో వేగనివ్వాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి.కొత్తిమీర వేసుకొని దించుకుని తినేముందు పైన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని తింటే బావుంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top