అమంగళం - చార్మి మంగళ విశ్లేషణ

మంత్ర కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఛార్మీ, దర్శకుడు తులసీరామ్ ప్రేక్షకులపై సంధించిన చిత్రం మంగళ విశ్లేషణకు వస్తే చార్మి పూర్తిగా భుజాన వేసుకుని చేసిన చిత్రం ఇది. ఆమె మంగళ పాత్రను పూర్తి ఫెరఫెక్షన్ తో చేయటానకి ప్రయత్నించినా దర్సకుడు దృష్టి మాత్రం ఆమె గ్లామర్ పైనే ఉండటం మైనస్ అయింది. ఇక మంత్రలో చేతబడి,క్షుద్ర విధ్యలు, దెయ్యాలు వంటివి లేవని చెప్పి విజయం సాధించిన దర్శకుడు ఈ సారి చేతబడి,శకూచి వంటివి ఉన్నాయనే కోణంలో కథ నడిపి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు.అలాగే ఇలాంటి సినిమాలకు టెక్నికల్ గా అడ్వాన్స్ గా ఉంటేనే హాలీవుడ్ హర్రర్ సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రేక్షకుడిని అలరించగలిగేది. అయితే ఈ చిత్రంలో చాలా ఉపయోగించిన గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ పై ఎంతో ఆశలు పెట్టుకుని ఈ చిత్రం రూపొందించినట్లు అర్దమవుతుంది. కానీ ఆదీ పండలేదు. అయితే ఈ సినిమాను చార్మి అభిమాలు మాత్రం ఐస్ ..ఐస్ పాట కోసం చూడొచ్చు. స్టెప్స్ బాగుంటాయి.

ఫైనల్ గా ఓ హర్రర్ సినిమాకు వెళ్థున్నా మనం భయపడాలి అని ఫిక్స్ అయిన వారు మాత్రమే ఈ చిత్రం చూడ్డానికి వెళ్ళటం బెస్ట్ . అలాగే మంత్ర రేంజిలో ఊహించుకుని వెళితే మాత్రం పూర్తి నిరాశ ఎదురవుతుంది.వర్మ రెగ్యులర్ హర్రర్ సినిమాల చూడ్డానకి అలవాటు పడ్డ వారికైతే ఈ చిత్రం బాగానే ఉందనిపిస్తుంది. మంత్రలో ఏమైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని వదిలేసి చార్మి గ్లామర్ నే పెట్టుబడిగా భావించి చేసిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకుంది. అయితే మార్నింగ్ షోకే మామూలు టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆ రేంజిలో నిలబడుతుందా అనేది ప్రశ్నార్దకంగా మారింది. చాలా కాలం షూటింగ్ చేసుకుని, ఆర్దికపరమైన ఒత్తిళ్ళను తప్పుకుని ఈ చిత్రం తులసీరామ్ కెరీర్ కీ,వరస ఫ్లాపుల చార్మీ కెరీర్ కీ చాలా కీలకమైంది. ప్రేక్షకుల ఆదరణతో ఇచ్చే తీర్పుపై వారి కెరీర్ లు ముందుకెళ్ళటం ఆధారపడి ఉంటుందనేది నిజం.

మాంత్రికుడు ముత్తయ్య(ప్రదీప్ రావత్) కి కొడుకు చిన్నా అంటే ప్రాణం. చిన్నా కి సినిమా హీరోయిన్ మంగళ (చార్మి)కు వీరాభిమాని. దాంతో అతను ఆమెను కలుసుకుని కారు బహుమతిగా ఇవ్వాలని హైదరాబాద్ వస్తాడు. అయితే అనుకోకుండా జరిగిన ఓ పొరపాటు కారణంగా చిన్నా దెబ్బలు తింటాడు. తానూ చేయకపోయినా జరిగినదానికి అవమానంతో ఆత్మహత్య చేసుకుంటాడు. దానితో మంగళ మీద కసి పెంచుకున్న ముత్తయ్య భయంకరమైన క్షుద్ర శక్తి శకుచి ని ప్రయోగిస్తాడు. దాని ప్రభావంతో మంగళ రకరకాల కష్టాలు పడుతుంది. వాటికీ కారణం క్షుద్ర ప్రయోగమనీ, దానిని ఆపాలంటే ప్రయోగించిన వాడే నివారించాలి అని తెలుసుకుని క్షమించమని వేడుకోటానికి వెళ్ళేప్పటికి అక్కడ ముత్తయ్య చనిపోయుంటాడు. ఇక అక్కడనుండి మంగళ ఏవిదంగా ఆ ఘోర పరిస్థితిని ఎదుర్కుని ఆ ప్రమాదం నుండి బయటపడింది అనేది మిగిలిన కధ.



మంగళ విశ్లేషణకు వస్తే చార్మి పూర్తిగా భుజాన వేసుకుని చేసిన చిత్రం ఇది. ఆమె మంగళ పాత్రను పూర్తి ఫెరఫెక్షన్ తో చేయటానకి ప్రయత్నించినా దర్సకుడు దృష్టి మాత్రం ఆమె గ్లామర్ పైనే ఉండటం మైనస్ అయింది. ఇక మంత్రలో చేతబడి,క్షుద్ర విధ్యలు, దెయ్యాలు వంటివి లేవని చెప్పి విజయం సాధించిన దర్శకుడు ఈ సారి చేతబడి,శకూచి వంటివి ఉన్నాయనే కోణంలో కథ నడిపి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు.అలాగే ఇలాంటి సినిమాలకు టెక్నికల్ గా అడ్వాన్స్ గా ఉంటేనే హాలీవుడ్ హర్రర్ సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రేక్షకుడిని అలరించగలిగేది. అయితే ఈ చిత్రంలో చాలా ఉపయోగించిన గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ పై ఎంతో ఆశలు పెట్టుకుని ఈ చిత్రం రూపొందించినట్లు అర్దమవుతుంది. కానీ ఆదీ పండలేదు. అయితే ఈ సినిమాను చార్మి అభిమాలు మాత్రం ఐస్ ..ఐస్ పాట కోసం చూడొచ్చు. స్టెప్స్ బాగుంటాయి.

ఫైనల్ గా ఓ హర్రర్ సినిమాకు వెళ్థున్నా మనం భయపడాలి అని ఫిక్స్ అయిన వారు మాత్రమే ఈ చిత్రం చూడ్డానికి వెళ్ళటం బెస్ట్ . అలాగే మంత్ర రేంజిలో ఊహించుకుని వెళితే మాత్రం పూర్తి నిరాశ ఎదురవుతుంది.వర్మ రెగ్యులర్ హర్రర్ సినిమాల చూడ్డానకి అలవాటు పడ్డ వారికైతే ఈ చిత్రం బాగానే ఉందనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top