పనీర్‌ ఫ్రైడ్‌ రైస్‌


కావల్సినవి: 
పనీర్‌ - అరకప్పు, బియ్యం - కప్పున్నర, నూనె - పావుకప్పు, పచ్చి బఠాణీలు - అరకప్పు, జీడిపప్పు - పావుకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, ఉల్లికాడల తురుము - పావుకప్పు, చిల్లీసాస్‌ టమాటాసాస్‌- చెంచా చొప్పున, అల్లం వెల్లుల్లి ముద్ద - రెండుచెంచాలు, గరంమసాలా, మిరియాలపొడి - అరచెంచా చొప్పున, ఉప్పు- రుచికి తగినంత.
తయారీ: 
 బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి అంగుళం ముక్కలుగా కోసిన పనీర్‌ , జీడిపప్పు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. తరవాత బియ్యం కడిగి కాస్త పొడిపొడిగా వండి పక్కన పెట్టుకోవాలి. అన్నంలో కొద్దిగా ఉప్ప కలిపి పళ్లెంలో చల్లార బెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేయించి, ఉల్లికాడల తురుము, పచ్చిబఠాణీలు, క్యారెట్‌ తరుము వేసి బాగా వేయించాలి. పదినిమిషాలయ్యాక చిల్లీసాస్‌, టమాటాసాస్‌, మిరియాలపొడి, గరంమసాలా పొడి తగినంత ఉప్పువేసి బాగా కలపాలి. ఇందులో వేయించిన పనీర్‌, జీడిపప్పు పలుకులు, అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి. చివరిగా తురిమిన కొత్తిమీర, కొబ్బరి కూడా చల్లి దించేస్తే పనీర్‌ ఫ్రైడ్‌ రైస్‌ తయార్‌. వేడివేడిగా వడ్డించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top