చిన్నవయసులోనే చర్మంపై ముడతలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు

చిన్నవయసులోనే చర్మంపై ముడతలు చాలామందిని వేధించే సమస్య. అవి ఎదురయ్యాక రకరకాల చికిత్సలు ప్రయత్నించేకన్నా, మొదట్నుంచీ జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. అందుకు ఉపయోగపడే సూచనలే ఇవి.

'ఇ' పోషకం తప్పనిసరి: 
శరీరంలో విటమిన్‌ ఇ లోపం కూడా ముడతల్ని పెంచుతాయి. ఇది మాత్ర రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎలా తీసుకోవాలో అడిగి తెలుసుకుని వాడండి. అలాగే రాత్రిళ్లు ... ముఖానికి విటమిన్‌ ఇ నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరుస్తుంది.

ముడతల్ని కొంతవరకు కనిపించకుండా చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
  •  గుడ్డులోని తెల్లసొన తీసుకుని కళ్ల అడుగున, నుదురుకు పూతలా వేయాలి. తెల్లసోనలోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.

  •  మందులేని విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ను చిన్నకప్పులోకి తీసుకోవాలి. ఇందులో రెండు చెంచాల పెరుగు, తేనె, నిమ్మరసం అరచెంచా చొప్పున తీసుకుని బాగా కలిపి.. దూదితో ముఖమంతా రుద్దుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేసుకుంటే చాలు. ఎంతో మార్పు కనిపిస్తుంది చర్మం తేటగానూ మారుతుంది.
  •  పావుకప్పు కొబ్బరినూనె తీసుకుని నాలుగైదు చుక్కల విటమిన్‌ ఇ నూనె కలిపి చర్మానికి రాసుకోవాలి. ఇప్పుడు మునివేళ్లతో బాగా మర్దన చేసి.. మర్నాడు కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది.

  •  అరకప్పు చెరకురసంలో సరిపడా పసుపు కలిపి చర్మానికి పూతలా వేయాలి. కాసేపయ్యాక కడిగేస్తే.. మార్పు కనిపిస్తుంది. ఆముదంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. నిమ్మలోని సి విటమిన్‌ ముడతలను నివారించడంలో చక్కగా పనిచేస్తుంది.

  • బొప్పాయిగుజ్జు, అరటిపండు గుజ్జు పావుకప్పు చొప్పున తీసుకుని ముఖానికి పూతలా రాయాలి. బొప్పాయిలోని పపైన్‌ అనే ఎంజైము మృతచర్మాన్ని తొలగిస్తుంది. అదే సమయంలో కొత్తచర్మం వచ్చేందుకు కారణమవుతుంది. అరటిపండ్లలోని ఎన్నో విటమిన్లు, చర్మం తేటగా మారేలా చేస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top