కలాకండ్


కావలసినవి: 
పనీర్ - 500 గ్రా, మిల్క్ మెయిడ్ - 400 గ్రా
పాల పొడి - రెండు కప్పులు, కుంకుమ పువ్వు - చిటికెడు
(కలర్ కోసం ఒక టీ స్పూన్ వేడి పాలలో వేసి ఉంచాలి), నెయ్యి - టీ స్పూన్, బాదం- నాలుగు (నానబెట్టి ఒలిచి పలుచగా తరగాలి), పిస్తా - టీ స్పూన్
తయారి:
పనీర్‌ను మెత్తగా పొడి అయ్యేటట్లు చేత్తో చిదమాలి. అందులో మిల్క్‌మెయిడ్, పాల పొడి కలపాలి. ఆ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసి సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత దించి దానిని మూడు భాగాలుగా చేయాలి. ఒక భాగంలో కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసి సమంగా పట్టేటట్లు కలిపితే ఆరెంజ్ కలర్‌లోకి వస్తుంది.

ఒక ట్రేలో నెయ్యి రాసి ముందుగా రంగు కలపని కలాకండ్ మిశ్రమాన్ని వేసి సమంగా సర్దాలి. దాని మీద కుంకుమ పువ్వు కలిపిన మిశ్రమాన్ని వేసి సర్దాలి. ఆ పైన మళ్లీ రంగు వేయని మిశ్రమాన్ని వేసి చివరగా బాదం, పిస్తాలతో గార్నిష్ చేయాలి. కలాకండ్ పూర్తిగా చల్లారి గట్టిపడిన తర్వాత కావలసిన షేప్‌లో కట్ చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top