పిజ్జా.. ఫ్రెంచ్‌ఫ్రైస్‌.. చిప్స్‌, పాస్తా.....బదులు తీసుకోవలసిన ఆహారం

ఐస్‌క్రీం: 
చక్కెరశాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో కెలొరీలు అధికం. దానికి తోడు కొన్నిసార్లు కృత్రిమ రంగులు, రుచుల్ని కూడా వాడుతుంటారు. 
ప్రత్యామ్నాయం:
పండ్లతో చేసుకునే రకరకాల స్మూతీల్లాంటివి ప్రయత్నించవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. నచ్చిన పండు ఒకటి తీసుకుని, ఒకవంతు సోయాపాలు, రెండు వంతులు వెన్న తీసిన పెరుగు వేసుకుని నిమిషాల్లో స్మూతీని తయారుచేసుకోవచ్చు. సోయాపాలు, పండ్లలో మాంసకృత్తులు, ఖనిజలవణాలు ఎక్కువ. దాంతో లావయ్యే సమస్య ఉండదు.
క్యాండీలు:
ఎప్పుడైనా తీపి తినాలనిపించడం ఆలస్యం.. ఓ క్యాండీ చప్పరిస్తుంటాం. కానీ ఇందులో చక్కెరశాతం అధికం. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
ప్రత్యామ్నాయం: 
ఎండుద్రాక్షను ప్రయత్నించండి. కొలెస్ట్రాల్‌ సమస్య ఉండదు. పైగా ఇందులో 70 శాతం సహజసిద్ధమైన ఫ్రక్టోస్‌ ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే ఆప్రికాట్లు కూడా తీసుకోవచ్చు. ఇక పీచు, మెగ్నీషియం, విటమిన్‌ బి లాంటి పోషకాలను అందించే బాదం, వాల్‌నట్లు వంటివి తినడం ఆరోగ్యానికి మంచిది.
సోడా: 
ఏ మాత్రం దాహంగా అనిపించినా.. గ్లాసుసోడా తాగేయడం చాలామందికి అలవాటు. కానీ.. ఇందులో కెలొరీలు చాలా ఎక్కువ. దానివల్ల దాహం తీరకపోగా మరింత పెరుగుతుంది. తరచూ తీసుకోవడం వల్ల దంతసంబంధ సమస్యలు మొదలవుతాయి.
ప్రత్యామ్నాయం: 
పండ్లరసాలు తీసుకోవడం మేలు. వాటిని చేసుకోవడం కూడా చాలా సులువు. పైగా రెండు మూడు రకాల పండ్లరసాలు కలిపి.. ఫ్రూట్‌పంచ్‌లా కూడా చేసుకోవచ్చు. అది కుదరనప్పుడు చల్లనినీటిలో నిమ్మరసం పిండి తాగడం మంచిది.


పాస్తా: 
శుద్ధిచేసిన పిండితో తయారుచేసిన పాస్తాలో పీచుశాతం చాలా తక్కువగా ఉంటుంది. పైగా సులువుగా జీర్ణం కాదు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
ప్రత్యామ్నాయం:
గోధుమలతో చేసిన పాస్తా తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలాగే.. కొన్నిరకాల కూరగాయలు కూడా చేర్చుకుంటే మంచిది.


బర్గర్లు:
బంగాళాదుంపలు, మయోనైజ్‌, వైట్‌బ్రెడ్‌.. ఇలా రకరకాల పదార్థాలతో కలిపి చేసే బర్గర్లతో అధికకొవ్వు సమస్య ఉంటుంది. ఇది గండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. దానికితోడు శరీరంలో కొవ్వుశాతం ఎక్కువగా పేరుకుంటుంది.
ప్రత్యామ్నాయం: 
బ్రౌన్‌బ్రెడ్‌తో చేసిన బర్గర్‌ను తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. పీచుశాతం కూడా ఎక్కువగా అందుతుంది. ఇక వేసుకునే పదార్థాలను కూడా పరిమితం చేసి... తేనె లాంటివి వాడితే.. సమస్యలను చాలామటుకు తగ్గించినట్లే.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top