పగటి నిద్ర మంచిదే

పగలు తీసే కునుకు గుండెకు మేలు చేస్తుందట. ఎందుకంటే యాభైయేళ్ల క్రితం రాత్రి నిద్రాసమయంతో పోలిస్తే... ఈ మధ్య కాలంలో ఆ సమయం రెండుగంటలు తగ్గిపోయింది. దాంతో ఆరోగ్యంపై ప్రభావం పడి తరచుగా, త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారట ఎక్కువ మంది. అందుకని పగలు ఒక గంట నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు.

తక్కువ నిద్రపోవడం వల్ల హైపర్‌టెన్షన్(రక్తపోటు), కార్డియో వాస్కులార్ (హృదయసంబంధిత) సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతున్నదట. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే పగలు ఓ కునుకు తీయక తప్పదంటున్నారు వాళ్లు. 45 నుంచి 60 నిమిషాలపాటు పోయే పగటి నిద్ర రక్తపోటును క్రమపద్ధతిలో ఉంచి, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. ఆఫీసుల్లో ఎలా అంటారా? బహుశా స్లీపింగ్ రూమ్స్ పెట్టాలేమో!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top