కావలసిన పదార్థాలు
నల్లద్రాక్షరసం - ఒక గ్లాసు, సోయా - నాలుగు గ్లాసులు, బెల్లం - అర కేజీ, గోధుమపిండి - అర కేజీ, మైదా పిండి - పావు కేజీ, ఉప్పు - అర టీ స్పూన్, నూనె - సరిపడా, పంచదార - పావు కేజీ, యాలకుల పొడి - అర టీ స్పూన్.
తయారుచేయు విధానం
ముందుగా సోయాను ఒక రోజంతా నానబెట్టాలి. తరువాత కుక్కర్లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తరువాత నీటిని పారబోసి సోయాను గ్రైండర్లో వేసి యాలకుల పొడి, బెల్లం, పంచదార వేసి మెత్తగా పట్టుకోవాలి. గోధుమ పిండి, మైదాపిండిని తీసుకుని కొద్ది కొద్దిగా ద్రాక్షరసం వేసి తడుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి పూరీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. సోయా మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ మధ్యలో సోయా మిశ్రమం పెట్టి మళ్లీ బొబ్బట్ల మాదిరిగా వత్తుకోవాలి. వీటిని నూనె వేసుకుంటూ పెనంపై కాల్చుకోవాలి. అంతే.. సోయా బొబ్బట్లు రెడీ.