ఎన్టీఆర్ లవకుశ కంటే గొప్పగా బాలయ్య శ్రీరామరాజ్యం...........

యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగాప్రముఖ దర్శకులు బాపు దర్శకత్వంలో సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామరాజ్యం. ఈ చిత్రంలో వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్, సీతగా నయనతార నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో నిరవధికంగా జరుగుతోంది.

ఈతరం వారికే కాక రేపటి తరం వారికి ఆ ముందుతరం వారికి మన రామాయణం పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా, శ్రీరాముడిని గుర్తుంచుకునేలా ఉండేందుకే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. మన రామాయణ, భాగవత, భారతాలు ఎప్పటికీ జనజీవనాలు. మన సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలు. వాటిని మర్చిపోతే మనకు గతం లేదు. మనకు చరిత్ర లేదు. సమాజం లేదు. అందుకే గతంలో రామారావుగారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్యకావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశకంటే గొప్పగా శ్రీరామరాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
 
లవకుశ జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలేయడం, వాల్మీకి ఆమెను ఆదరించడం మొదలైన సన్నివేశాలను వాల్మీకి ఆశ్రమంలో 14 సెట్స్ లో చిత్రీకరించాం. మరోపక్క రామోజీ ఫిలిమ్ సిటీలో దర్బారు, ఏకాంత మందిరం, కౌసల్య మందిరం మొదలైన సెట్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలాంజనేయునిగా పవన్ శ్రీరామ్, కైకేయిగా సన, కౌసల్యగా కె.ఆర్.విజయ, జనకునిగా మురళీ మోహన్, చాకలి తిప్పనిగా బ్రహ్మానందం నటిస్తున్నారు. శ్రీరాముని జననం నుండి రావాణాసుర సంహారం వరకూ పది నిమిషాల పాటలో కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది..? రాముని విశిష్టత ఏమిటి? అనే విశేషాలే ఈ శ్రీరామరాజ్యం. ఇందులో 8 పాటలు, బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. జూన్ 10కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది నా కోరిక. ఆ శ్రీరాముని దయ వల్ల నా కోరిక నెరవేరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు నిర్మాత తెలియజేశారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top