సమ్మర్ ట్రిప్ ప్లాన్ రెడీనా!

వేసవి ఇంకా రానేలేదు అప్పుడే ప్లానింగ్ ఏమిటి అని చిరాకు పడకండి. ఇప్పటి నుంచే ఆలోచించకపోతే మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఇష్టంలేని ఏ వేడి ప్రదేశంలోనో వేసవి గడిపేయాల్సి ఉంటుంది. ఓ వైపు పిల్లల పరీక్షలు జరుగుతున్నా, మరోవైపు మీరు బిజీగా ఉన్నా ఇప్పటి నుంచే ప్లాన్ చేయకపోతే మళ్లీ స్కూళ్లు తెరిచే లోగా విహారయాత్రకు వెళ్లి రావడం అసాధ్యం. వేసవి విహారం ప్లానింగ్‌కు ఈ టిప్స్ పనికొస్తాయోమో చూడండి.

  •   వేసవిలో ఎక్కడికి వెళ్లాలి అనే విషయాన్ని ముందుగా నిర్ణయించుకోండి.
  •   దక్షిణాదిలో అన్నీ చూసేశాం. ఊటీ బోర్ కొట్టేసింది. కొడైకెనాల్ సంగతి సరేసరి. మరెక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా! సిమ్లా, కులూ, నైనితాల్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి.
  •   ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్‌లు వెళ్లాలనుకుంటే ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించండి.
  •   తేదీలను నిర్ణయించుకొని రైలు రిజర్వేషన్ ముందుగానే చేయించండి. చివరి నిమిషంలో రిజర్వేషన్ దొరక్కపోతే విహారం కాస్తా విషాదంగా మారుతుంది.
  •   ఒకవేళ విమానంలో వెళ్లాలకున్నా రెండు నెలల ముందుగా బుక్ చేస్తే తక్కువ ధరకు టికెట్లు దొరుకుతాయి.
  •   మీరు వె ళ్లే ప్రాంతంలో ఉండేందుకు వసతి గురించి ఇంటర్నెట్‌లో వాకబు చేయండి. వీలయితే ఫోన్ చేసి హోటల్‌లో ఉండే వసతి, సౌకర్యాల గురించి వివరాలు సేకరించండి. సమ్మర్ ప్యాకేజ్‌లు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి. ప్యాకేజ్‌లలో వసతి, భోజనం కలిపి తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.
  •   మీరు వెళ్లే ప్రదేశం చుట్టుపక్కల చూసేందుకు ఏ ప్రదేశాలున్నాయి? వాటిలో ఏం చూడాలనే అంశాలను ముందుగా నిర్ణయించుకోండి.
    •   వీలయితే మీ ఫ్రెండ్స్ కుటుంబాలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయండి. గుడ్‌లక్.
    block1/Bhakti

    buttons=(Accept !) days=(20)

    Our website uses cookies to enhance your experience. Learn More
    Accept !
    To Top