అధిక బరువును తగ్గించుకోవాలనే నిర్ణయం ఏ వయసులో తీసుకోవాలి .

బరువు తగ్గించుకొంటే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా మంచిదే. కానీ అధిక బరువును తగ్గించుకోవాలనే నిర్ణయం ఏ వయసులో తీసుకోవాలన్నది కూడా కీలకమే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మూడు పదుల లోపు ఆ నిర్ణయం తీసుకొంటే మేలట. ఎందుకంటే లేటు వయసులో నిర్ణయం తీసుకొన్నా కఠినమైన ఆహార నియమాలు పాటించడానికి మహిళలు అంత శ్రద్ధ వహించరని తాజా అధ్యయనాల్లో తేలింది. నలభైలోనో, ఏభైలోనో అడుగు 
పెట్టాక బరువు తగ్గాలనే ఆసక్తి పెద్దగా ఉండదు. కారణం పాతికల్లో ఉన్నంత చురుకుదనం.. స్నేహాలు ఉండవు. పైగా కుటుంబ బాధ్యతలుంటాయి. తీసుకొన్న నిర్ణయాలని అమలుచేయడానికి ఇవన్నీ అడ్డొస్తాయి. అదే పాతికలోపు కనుక శ్రద్ధగా బరువు తగ్గడం మొదలుపెడితే దానిని కొనసాగించడం సాధ్యమవుతుంది. అవివాహితులు అయితే ఇంకా వేగంగా బరువు తగ్గుతారని అధ్యయనం చెబుతోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top