జీవక్రియలను నియంత్రించే థైరాయిడ్ గురించి తెలుసుకుందామా .....

థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలు చోటు చేసుకుంటాయి. ఒకటి టి3, టి4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. రక్తపరీక్షల్లో టీఎస్‌హెచ్ పెరగడం, టి3, టి4 తగ్గడం లేక నార్మల్‌గా ఉంటుంది. రెండవది టి3, టి4 పెరగడం వలన హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది.

థైరాయిడ్ గ్రంథి లోపాలు మన శారీరక, మానసిక వ్యవస్థమీద పనిచేస్తాయి.థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా మూడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి ట్రైఐడో థైరోనిన్, థైరాక్సిన్, కాల్సిటోనిక్. ఈ హార్మోన్ల వలన మెటబాలిక్ ప్రాసెస్ త్వరితగతిన సాగుతుంది. ఇవి బరువు, ఎత్తు, ఎదుగుదల, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రతలను, రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.



థైరాయిడ్ జీవక్రియలకు అవసరమైన ముఖ్యమైన గ్రంథి. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి పనిచేయదో అది శరీరంలోని ప్రతీ జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళన, శక్తి స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది.
 

థైరాయిడ్ సమస్యల్ని గుర్తించనట్లయితే స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళన, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్ డిస్‌ఫంక్షన్, సంతానలేమి తదితర ఆరోగ్య సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంటుంది.థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను తయారుచేస్తుంటుంది. ఈ హార్లోన్లు శరీరంలో బీఎమ్ఆర్(బేస్‌డ్ మెటబాలిక్ రేట్)ను పెంచుతాయి. ప్రొటీన్ల తయారీలో, గుండెకు, ఇతర అవయవాలకు రక్త సరఫరాను హెచ్చించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోన్స్ వల్ల పిల్లల్లో గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. సరియైన సమత్యులత, పోషణ, శరీర పెరుగుదలకు థైరాయిడ్ గ్రం«థి అవసరం చాలా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథిలో మార్పులు చోటుచేసుకుంటాయి.
థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్స్ ఎక్కువ కావడం లేదా తక్కువ కావడం.

హైపర్‌థైరాయిడిజమ్
థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అయినపుడు దానిని హైపర్‌థైరాయిడిజమ్ అంటారు.



లక్షణాలు
ఆకలి బాగా ఉంటుంది కానీ, బరువు తగ్గుతారు. కోపం, చికాకు, నీరసం, అలసట, ఉద్రేకం, నాడీ వేగం పెరగటం, కాళ్లు, చేతులు వణుకుట, ఎక్కువ వేడిని భరించలేకపోవుట, చెమటలు పట్టుట, నీటి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారం మామూలుగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా బరువు కోల్పోవడం అనేది హైపర్ థైరాయిడిజమ్‌కు సూచన. థైరాయిడ్ గ్రంథి భాగం వాచి నొప్పి ఉన్నప్పుడు థైరోటాక్సికోసిస్ అంటారు. దీనినే అటో ఇమ్యూన్ డిజార్టర్ అంటారు. ఇది ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది.

హైపోథైరాయిడిజమ్
టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తి కొన్ని కారణాల వల్ల తగ్గిపోతుంది. దీనిని హైపోథైరాయిడిజమ్ అంటారు.

లక్షణాలు
నీరసం, బద్దకం, బరువు పెరగటం, ముఖం వాచినట్లుండటం, జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లుండటం, మలబద్దకం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


కండరాలు, కీళ్ల నొప్పులు, చేతుల్లో నీరసం, చేతిలో కార్పల్ టన్నెల్, కాళ్లలో టార్సల్ టన్నెల్ సిండ్రోమ్‌లు వచ్చే అవకాశం ఎక్కువ అవడం. మెడ వాచినట్లుగా అనిపించడం, టర్టిల్‌నెక్స్ లేక నెకెటిస్‌తో పాటు అసౌకర్యం, గొంతు బొంగురు పోవుట, థైరాయిడ్ గ్రంథి బయటకు కనిపించే విధంగా పెద్దగా అవడం. ఇవన్నీ థైరాయిడ్ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వెంట్రుకలు ఊడిపోవడం అనేది థైరాయిడ్ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం. హైపోథైరాయిడిజమ్ కలిగిన వారిలో వెంట్రుకలు ముతకగా, మందంగా,ఎండినట్లుగా అవుతాయి. చర్మము మందంగా, ఎండిపోయినట్లుగా అవుతుంది.

థైరాయిడ్ సమస్య ఉంటే కనిపించే మరో లక్షణం మలబద్దకం. విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఎక్కువగా హైపర్ థైరాయిడిజమ్‌లో ఉంటాయి. కొలెస్టరాల్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం, ఆహారం తగ్గించినా, వ్యాయామం చేసినా, కొలెస్టరాల్ తగ్గించే మందులు ఉపయోగించినా కూడా సాధారణ స్థాయికి రాకపోవడం హైపోథైరాయిడిజమ్‌కి సూచనగా భావించవచ్చు.



తక్కువ కొవ్వు పదార్థాలున్న, క్యాలరీలున్న ఆహారం తీసుకోవడంతో పాటు తగిన శారీరక వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు కోల్పోకపోవడం లేక బరువు పెరగకపోవడం జరుగుతుంది. హైపోథైరాయిడిజమ్ ఉన్న వారిలో బరువును కోల్పోవుట చాలా కష్టంతో కూడుకున్న పని.

నిర్ధారణ
రక్తపరీక్షలు చేయడం ద్వారా టి3, టి4, టీఎస్‌హెచ్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా రోగనిర్ధారణ చేసుకోవచ్చు.

చికిత్స

హోమియోపతి చికిత్స ద్వారా థైరాయిడ్ హార్మోన్ సమస్యలను సరిచేసే వీలుంది. థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించడం ద్వారా హార్మోన్స్‌ను రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి టి3, టి4, టీఎస్‌హెచ్ నార్మల్ రేంజ్ కు వచ్చిన తరువాత చాలా ఏళ్ల వరకు థైరాయిడ్ నార్మల్‌గా పనిచేస్తుంది. హార్మోన్స్ నార్మల్ అయిన వెంటనే ఊబకాయం, నిద్రలేమి, ఆత్రుత, ఆందోళన తగ్గిపోతాయి. శారీరక, మానసిక సమస్యలు సర్దుకుంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top