ఒత్తిడిని దూరం చేస్తూ... ఉల్లాసాన్ని కలిగిస్తూ..... ‘స్పా’

యువతీయువకులు ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఉపశమన మార్గాల్ని అన్వేషిస్తుంటారు. ఇందుకోసం వారు యోగా, ధ్యానం, మసాజ్‌, స్పా కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. పనితో అలసిపోయి కనీస వ్యాయామానికి దూరమైపోతున్నవారు, అనారోగ్యాన్ని మూట గట్టుకోకుండా ఉండాలంటే ఇవి అవసరమే. పని ఒత్తిడిని పోగొటి్టి ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా సౌందర్యాన్ని మెరుగు పరిచే ‘స్పా’ సేవలు పొందేందుకు యువతీయువకులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

నిరంతరంగా పనిలో నిమగ్నమైన వారికి, వదల కుండా నీడలా వెంటాడే ఒత్తిడిని దూరం చేసు కునేందుకు ఉపశమన మార్గాల్ని అన్వేషించే వారికి ‘స్పా’ లు ఆశాకిరణాలుగా మారాయి. ఆరోగ్యానికి, సౌందర్యా నికి సంబంధించిన సేవల్ని అందించడంతో నగరంలో వీటి కి ఆదరణ రోజు రోజుకీ పెరుగుతుంది.

స్పా అంటే..
మసాజ్‌కి మరో పేరుగా వీటిని వ్యవహరిస్తారు. ఒక క్ర మ పద్ధతిలో శరీరంపై ఒత్తి డిని తీసుకురావడం. కొన్ని తై లాలు, మూలికలు, రసాయ నాలతో పాటు వేడి నీటితో, ఆవిరితో మానసిక, శారీరక అలసటను పోగొట్టే విధానం ఇందులో ఉంటుంది. మొ దట్లో దీన్ని యుద్ధంలో పోరాడే సైనికులకు వినియోగిం చేవారని, త్వరగా అలసట నుంచి తేరుకునేందుకు, మరింత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఈ విధానాన్ని వినియోగించే వారని ప్రచారంలో ఉంది.

ఎక్కడ...
మొదట ఫైవ్‌ స్టార్‌, త్రీ స్టార్‌ హోటళ్లలో స్పా కేంద్రా లను ఏర్పాటుచేశారు. తరువాత వీటి గురించి ప్రజల కు అవగాహన ఏర్పడి ఆదరణ పెరగడంతో ప్రత్యే కంగా స్పా కేంద్రాలు వెలిశాయి. పరిశుభ్రమైన పరిసరాలు, శ్రావ్యమైన సంగీతం నేటి స్పా స్వరూపాలుగా చెప్పొ చ్చు. ఈ సంస్కృతి ప్రధాన నగరాలలో నాలుగైదేళ్లుగా బాగా పెరిగింది.

ఆయుర్వేదం మిళితమై...  

‘స్పా’ సంస్కృతి పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతై నా... అసలు ఇదంతా భారతీయతత్వంలో ఉందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో పేర్కొన్న పలు విధానాలు స్పాలో వినియోగించడమే ఇం దుకు నిదర్శనంగా వారు చెప్పారు. ‘‘అభ్యంగ... శిరో ధార.. చూర్ణస్వేదన’’ తదితర సేవల్ని పలుచోట్ల అంది స్తున్నారు. ఇదే సమయంలో పాశ్చాత్య సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. స్వీడీష్‌... ఆరోమా.. థీమ్‌ తదితర పేర్లతో సేవల్ని అందిస్తున్నారు. వీటిని గంట మొదలు కొని రెండు గంటల వరకు నిర్వహిస్తారు.వీటికి పెరుగుతున్న క్రేజ్‌తో సొమ్ము చేసుకుంటున్నవారు నానాటికీ పెరిగిపోతున్నారు.

అందంపై మక్కువ...
స్పాలకు దూరంగా ఉండే నగర ప్రజలు మారిన జీవన ప్రమాణాలతో పాటు, ఆరోగ్యంపై పెరుగుతున్న సృ్ఫ హ... అందంపై రెట్టింపైన మక్కువ వీటికి దగ్గర చేస్తోం ది. సౌందర్య సేవల్ని వినియోగించుకోవడానికి మహిళ లు బయటకు అడుగుపెట్టడానికి ఎంతో సందేహపడే వా రు. ఇంట్లోనే సేవలు కావాలని కోరుకునేవారు. నెమ్మ దిగా మార్పు మొదలైంది. ఇప్పుడు నేరుగా స్పా కేంద్రా లకు రావడమేకాదు. వారి కెలాంటి సేవలు అవసరమో, ఆ విషయంపై కూడా అవగాహన వస్తుండడం తాజా ప రిణామం. ఈ సేవల్ని అందించే సెంటర్లలో మసాజ్‌తో పాటు...యోగా.. సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆయుర్వేదానికే ఎక్కువ ఫలితం... 

ఆయుర్వేదాన్ని కలగలిపి చేసే స్పా సేవలకు ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు ఉంటాయని తరచూ స్పా సే వలను పొందే వారు తెలిపారు. మరో ఆసక్తికరమైన అం శమేమంటే... ఈ కేంద్రాలకు వచ్చే వారిలో ఎక్కువ మంది భారతీయులు పాశ్చాత్య దేశాల స్పా సేవల్ని కోరి తే.. విదేశీయుల్లో ఎక్కువమంది.. ఆయుర్వేదాన్ని ఎం చుకుంటున్నారని తేలింది. ఆయుర్వేదంలో చెక్క బల్లపై మసాజ్‌ చేస్తే.. పాశ్చాత్య విధానంలో కుషన్‌తో కూడిన టేబుల్‌ వాడుతారు. అందువల్ల భారతీయులు ఎక్కువ మంది ఆయుర్వేదాన్ని ఇష్టపడరు. ఈ రెండిటిలో ఫలి తం దేనికి ఎక్కువగా ఉంటుందన్న విషయం పై అవగా హన ఉన్న వారు మాత్రం ఆయుర్వేదాన్ని ఎంచుకుం టున్నారు. 


ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారే... 
ఈ సేవల్ని కోరుకునే వారిలో ఎక్కువ మంది 25 సంవత్సరాలు దాటిన వారే ఉన్నారని నిర్వాహకులు తెలి పారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలో పని ఒత్తిడి ఎక్కు వగా ఉన్నవారే వీటిని ఆశ్రయిస్తున్నారని వారు పేర్కొ న్నారు. అంతే కాకుండా మారిన పని విధానం కూడ అ నారోగ్యానికి కారణం అవుతుంది. కంప్యూటర్‌ ముందు కుర్చీలో ఎక్కువ సేపు గడపడం వల్ల వెన్ను సంబంధిత సమస్యలు నగరవాసుల్లో ఎక్కువగా కనిపిస్తు న్నాయి. స్పాలకు వచ్చేవారిలో ఈ రెండు సమస్యలతో సతమత మయ్యే వారే పెద్ద సంఖ్యలో ఉంటున్నారు.

ప్రత్యేక ప్యాకేజీలు...
అనధికార సమాచారం ప్రకారం హైదరాబాద్‌ నగ రంలో స్టార్‌ హోటళ్లలో ఉన్న వాటితో కలిపి యాభైకి పై గా పెద్ద స్పాలు ఉంటే... మధ్య తరహావి ఎనభైకి పైనే ఉ న్నాయి. ఇక అందరినీ ఆకట్టుకునేందుకు స్పా కేంద్రా లలో ప్రత్యేక
ప్యాకేజీ లను సైతం ప్రకటి స్తున్నారు. దీంతో యు వతీ యు వకులు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top