వేసవిలో వచ్చే వేడి పొక్కులకు జాగ్రత్తలు

వేసవికాలం వచ్చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో వేడిమి వల్ల విపరీతమైన చెమటతో పాటు చర్మంపై రాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
  •   ఐస్‌ప్యాక్‌ని రాషెస్ ఏర్పడిన చోట పెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. పది నిమిషాల పాటు ఐస్‌ప్యాక్ పెట్టడం మూలంగా మంచి ఫలితం ఉంటుంది.
  •   కలబంద ముక్కలను కట్ చేసి రాషెస్‌పైన మెల్లగా రాయాలి. రోజుకు మూడు సార్లు ఇలా చేయాలి. కలబంద మొక్క లేని వారు మార్కెట్లో దొరికే అలొవెరా జెల్ ఉపయోగించవచ్చు. అలొవెరాలో వేడిమి వల్ల వచ్చే పొక్కులను నివారించే గుణం ఉంది. ఇది చల్లదనాన్ని అందిస్తుంది.
  •   గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు బేకింగ్ సోడా లేదా ఓట్‌మీల్ పౌడర్‌ను వేసి ఆ నీటితో స్నానం చేయాలి. వేడి పొక్కుల వల్ల కలిగే మంట, దురదను తగ్గించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది.
  •   స్నానం చేసిన తరువాత హెర్బల్ టాల్కమ్ పౌడర్‌ను రాషెస్ ఉన్న చోట వేసుకోవాలి. రోజుకు మూడు, నాలుగు సార్లు పౌడర్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల తడి లేకుండా, చెమట రాకుండా ఉంటుంది.
  •   కాస్త శనగపిండిని తీసుకుని నీటిని కలిపి పేస్టులా చేసి హీట్ రాషెస్‌పైన మెల్లగా రుద్దాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top