కూరగాయల వూతప్పం


కావల్సినవి:
బియ్యం- రెండు కప్పులు, మినప్పప్పు- కప్పు, సెనగపప్పు- అరకప్పు, పెసరపప్పు- అరకప్పు, పచ్చిమిర్చి-మూడు, ఉల్లిపాయలు - మూడు, టమాటాలు- రెండు, క్యారెట్‌ తురుము- కప్పు, బఠాణీలు- పావుకప్పు (ఉడికించుకోవాలి), బీన్స్‌- పది(తరిగి ఉడికించాలి), ఉప్పు- రుచికి తగినంత, నూనె- అరకప్పు.
 తయారీ: 
బియ్యం, మిగతా పప్పులను నానబెట్టుకొని మర్నాడు మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత ఉల్లిపాయలు, టమాటాలు తరిగి ఉంచుకోవాలి. తరవాత బాణలిలో మూడు చెంచాల నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మగ్గించి టమాటాలు, బీన్స్‌, బఠాణీలు వేయాలి. కొద్దిసేపయ్యాక అందులో ఉప్పు, కారం కలిపి దించేయాలి. ఈ కూర మిశ్రమాన్ని సిద్ధం చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో కలపాలి. అరగంటయ్యాక పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక పిండితో వూతప్పం వేసి నూనెతో కాల్చితే సరిపోతుంది. వేడివేడి కూరగాయల వూతప్పాన్ని కొబ్బరి చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top