వంటింటి నేస్తాలు.....ఎలక్ట్రానిక్‌ పరికరాలు.....

రెస్టారెంట్స్‌తో పాటు అనేక హోటల్స్‌లో ఎక్కువ వ్యయం కలిగిన ఎలక్ట్రానిక్‌ పరికరాల సహాయంతో వినియోగదారులకు తేలికగా వంటలను అందించగలుగుతున్నారు. అటువంటి పరికరాలు ఎక్కువ వ్యయంతో కూడుకున్నవి. ఇది వరకు వీటిని కొలుగోలు చేయాలంటే కష్టంగా ఉండేది.ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానంతో ఇంట్లో ఉపయోగించుకునే విధంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్నిటి పనితీరు... 

బర్గ్‌ స్టీమర్‌ ...



కొన్ని వంటలకు అనేక పదార్థాలను విడివిడిగా ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఒకే సమయంలో మూడు వంటల్ని చేసేందుకు రూపొందించిందే బర్గ్‌ స్టీమర్‌.ఆహార పదార్థాల్లో పోషక విలువలు దూరం కాకుండా ఒకేసారి మూడు రకాల వంటల్ని చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అన్నం, పప్పు, రసం వం టివి కేవలం 40-45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చు ఇందులో ప్రత్యేకంగా ఉన్న పరిక రంతో సమయాన్ని సెట్‌ చేయొచ్చు.
 

తండూరి వంట కాలకు.. 



ఈ మధ్య కాలంలో తం డూరి రుచులని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇంట్లో అటువంటి వంటకాలను చేసుకో వడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఎలక్ట్రిక్‌ తండూర్‌ ఉపయోగం పెరుగుతుంది. తక్కువ విద్యుత్‌ ఖర్చుతో ఎటువంటి వంటనైనా నూనెల్నివినియోగించకుండా దీన్ని వాడొచ్చు. చికెన్‌, మటన్‌ వంటి మాంసాహారమే కాకుండా,ఆలుగడ్డల వంటి వాటిని కూడా ఎంచక్కా ఉడికించ వచ్చు. పుల్కాలు, రొట్టెలు కూడా తయారు చేయవచ్చు. ఇందులో వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి.

చిటికెలో రెడీ ... 



ఎలాంటి నూనెలు వాడకుండా వడియాలు, బఠానీలు, పాప్‌కార్న్‌ వంటివి తయారు చేసుకోవచ్చు.ఏడాది గ్యారంటీతో రెండేళ్ల ఉచిత సర్వీసుతో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా దోసే, పుల్కా, చపాతీ వంటి 21 రకాల అల్పా హార వంటకాయలను రోటీ మేకర్‌ సిద్ధం చేస్తుంది. కేవలం పిండి కలిపి ముద్దగా చేసి ఇందులో ఉంచితే చాలు. నిమిషాల వ్యవధిలో సిద్ధం. కొవ్వు బాబోయ్‌ అంటూ...భయపడే నగరవాసుల కు ఇదెంతో ఉపయుక్తం. వంటనూనె కావాలం టే కొద్దిగా చేర్చవచ్చు.రెండు గంటలు ఉపయో గిస్తే యూనిట్‌ మాత్రమే విద్యుత్‌ ఖర్చవుతుందని చెప్పవచ్చు.
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top