రోజూ ఏదో ఒక రకమైన స్వీట్ తినందే మీకు నిద్రపట్టదా? అయితే జాగ్రత్త.

రోజూ ఏదో ఒక రకమైన స్వీట్ తినందే మీకు నిద్రపట్టదా? టీలో కూడా షుగర్ కాస్త ఎక్కువే ఉండాలా? అయితే జాగ్రత్త. హై షుగర్ ఫుడ్ తీసుకునే టీనేజర్స్ భవిష్యత్తులో గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడయింది. షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, ఫుడ్స్ తీసుకునే యువతీయువకులను పరిశీలించినపుడు వారి కొలెస్ట్రాల్, టైగ్లిజరైడ్ లెవెల్స్ నిర్ణీత స్థాయిలో లేవని తేలింది. ఇది కాలక్రమంలో హార్ట్ డిసీజ్‌కు దారితీసే అవకాశం ఉంది. ఊబకాయంతో బాధపడుతున్న టీనేజర్స్‌కి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. టీనేజ్‌లో ఉన్నాం కదా ఏం తిన్నా నడుస్తుందిలే అని అనుకోకుండా కాస్త నోటి తీపి తగ్గించుకుంటే మంచిదేమో ఆలోచించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top