ఏ రాశి వారికి ఏ రంగు నచ్చుతుందో తెలుసుకుందాం....

మనం రంగుల ప్రపంచంలో జీవిస్తున్నాం. కొన్ని రంగులు మనసును మురిపిస్తాయి. మరికొన్ని రంగులు చూడగానే ఎందుకో తెలియకుండానే మనకు వ్యతిరేక భావం ఏర్పడుతుంది. కొందరికి ముదురు రంగులు నచ్చితే మరికొందరికి లేత రంగులు మాత్రమే నచ్చుతాయి. ఇలా కొన్ని రంగులు నచ్చడానికి, ఇతర రంగులు నచ్చకపోవడానికి కారణమేమిటో తెలుసుకుందాం.మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ జన్మరాశి తెలుస్తుంది. ఫలానా రాశి వారికి ఫలానా రంగు అంటే ఇష్టం ఎక్కువ అని నిపుణులు ఏనాడో చెప్పారు. ఏ రాశి వారికి ఏ రంగు నచ్చుతుందో ఈ రంగుల పండుగ రోజు తెలుసుకుందాం.
 

మేషం (మార్చి 21-ఏప్రిల్ 20 తేదీల మధ్య పుట్టిన వారు)
మేష రాశి వారికి ఎరుపు, గులాబీ, గచ్చకాయ రంగులంటే ఇష్టం ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడి సంఖ్య 9. మంగళవారం వీరి వారం. ఈ రాశి వారికి బ్రౌన్ కలర్ కూడా బాగా నచ్చుతుంది.


వృషభం (ఏప్రిల్ 21 - మే 20 తేదీల మధ్య పుట్టిన వారు)
ఈరాశివారికి మిశ్రమ వర్ణాలు, తేలిక పాటి రంగులు, నీల వర్ణం బాగా నచ్చుతాయి. ఆకుపచ్చ రంగు కూడా వీరికి కొంతవరకు నచ్చుతుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రవారం, 6వ సంఖ్య వీరికి అనుకూలం. తెలుపురంగులు, ఫాన్సీ రంగులు కూడా వీరికి అనుకూలం.

మిథునం( మే 21-జూన్ 21 తేదీల మధ్య పుట్టిన వారు)
ఆకుపచ్చ, లేత బూడిద రంగు మిథున రాశివారికి బాగా నచ్చుతుంది. కారణం ఈ రాశికి నాయకుడు బుధుడు. బుధుడికి ఆకుపచ్చ రంగు ఇష్టం. బుధుడి సంఖ్య 5. బుధుడికి, గురువుకి శతృత్వం ఉంది కాబట్టి వీరికి కాషాయం, పసుపు రంగులు నచ్చవు. ముఖ్యంగా ఏ ముదురు రంగులూ సరిపడవు. బుధవారం అనుకూలం.



కర్కాటకం (జూన్ 22 -జూలై23 తేదీల మధ్య పుట్టిన వారు)
ఈ రాశికి బాస్ చంద్రుడు. అన్ని లేత రంగులు చంద్రుడికి వ ర్తిస్తాయి. ఈ రాశివారికి లేత ఆకుపచ్చ, లేత పసుపు, వెండి, వైలెట్, తెలుపులో షేడ్స్ కూడా ఈ రాశి వారికి బాగా నచ్చుతాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరి సంఖ్య 2, అదృష్టవారం సోమవారం.

సింహం (జూలై24- ఆగస్టు 23 తేదీల మధ్య పుట్టిన వారు)
ఈ రాశి వారికి గ్రహాల రాజయిన సూర్యుడు అధిపతి. అధికారం, నాయకత్వం ఈ రాశివారి లక్షణం. బంగారు పసుపురంగు, ఆరంజ్ రంగు, ఊదా రంగు వీరికి అనుకూలం. ఆదివారం, 1వ నెంబర్ వీరికి అనుకూలం.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్23 తేదీల మధ్య పుట్టిన వారు)
కన్యతో పాటు మిథున రాశికి కూడా అధిపతి బుధుడే. కాబట్టిన మిథునరాశి వారికి ఇష్టమైన ఆకుపచ్చతో పాటు బూడిదరంగు, తెలుపు, లేత ఆకుపచ్చ కూడా బాగా నచ్చుతాయి. బుధుడు అధిపతి కాబట్టి సంఖ్యాశాస్త్రం ప్రకారం 5, బుధవారం వీరికి కలిసి వస్తుంది.



తుల (సెప్టెంబర్24- అక్టోబర్ 23 తేదీల మధ్య పుట్టిన వారు)
ఈ రాశికి కూడా అధిపతి శుక్రుడే. వృషభ రాశి వారికి నీలం, లేత ఆరంజ్, గులాబీ, నీలి రంగుల్లోని వివిధ షేడ్స్ కూడా వీరికి నచ్చుతాయి. శుక్రుడు అధిపతి కాబట్టి ఆరో నెంబర్, శుక్రవారం కలిసివస్తుంది. ఎరుపురంగులకు దూరంగా ఉంటారు.

వృశ్చికం (అక్టోబర్ 24 -నవంబర్22 తేదీల మధ్య పుట్టిన వారు)
కుజుడే ఈ రాశికి కూడా అధిపతి. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శక్తితో వీరు పనులు చక్కబెడతారు. ముదురు ఎరుపు, ఎర్రగులాబీ రంగు ఈ తేదీల మధ్య పుట్టిన వారిలో చాలా మంది ఇష్టపడతారు. తెలుపు, తేత రంగులు వీరిలో చాలా మందికి అంతగా నచ్చవు.

ధనుస్సు(నవంబర్23-డిసెంబర్ 21తేదీల మధ్య పుట్టిన వారు)
గురువు ఈ రాశికి అధిపతి. విశాల భావాలు ఈ రాశివారి లక్షణం. వికాసం, సౌకర్యం వీరికి ప్రధానం. పసుపు వర్ణం, అందులో వివిధ షేడ్స్ వీరికి నచ్చుతాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం 3వ నెంబర్, గురువారం వీరికి అనుకూలం. నీలం, గులాబీ వర్ణాలు కూడా వీరికి నచ్చుతాయి.



మకరం(డిసెంబర్ 22- జనవరి 21తేదీల మధ్య పుట్టిన వారు)
నలుపు, నీలం, ముదురు ఊదారంగు వంటి ముదురు రంగులు వీరికి నచ్చుతాయి. అయితే లేత ఆకుపచ్చ, పింక్ వర్ణం కూడా వీరికి అనుకూలం. కలిసివచ్చే సంఖ్య 8, ఈ రాశికి అధిపతి శని కాబట్టి శనివారం అనుకూలం. క్రమశిక్షణ, అధికారం వీరికి లక్షణం.

కుంభం(జనవరి 22- ఫిబ్రవరి 19 తేదీల మధ్య పుట్టిన వారు)

ఈ రాశికి కూడా శనిగ్రహమే అధిపతి. నలుపు, ఊదా, గచ్చకాయ, నీలం రంగుల్లో తేలిక రంగులు ఈ రాశివారికి అనుకూలం. చిత్రవిచిత్రమైన రంగులు, కాంబినేషన్లు ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. 8వ సంఖ్య, శనివారం కలిసివస్తుంది.

మీనం( ఫిబ్రవరి 20-మార్చి 20 తేదీల మధ్య పుట్టిన వారు)

కళాత్మకదృష్టి ఈ రాశివారిలో అధికం. తెలుపు, బంగారం, మామిడి రంగులు వీరికి ఇష్టం. పచ్చరంగు వీరికి అంతగా నచ్చదు. గురువారం వీరికి కలిసివస్తుంది. 3వ నెంబర్ వీరి అదృష్టసంఖ్య. బృహస్పతి ఈ రాశివారికి బాస్.

ఏ తేదీల మధ్య పుట్టిన వారికి ఏ రంగు ఇష్టం అనే విషయాన్ని సూచనప్రాయంగా మాత్రమే చెప్పగలం అని, వారి జాతకం ఆధారంగా ఆ రాశికి అధిపతి అయిన గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి ఏ రంగు ఎక్కువ ఇష్టం అనే అంశం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top