వస్త్రధారణను బట్టి పర్‌ఫ్యూమ్‌లు ఎలా ఎంపిక చేసుకోవాలి ?

పర్‌ఫ్యూమ్ వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో రెండుమూడు రకాల పర్‌ఫ్యూమ్ బాటిల్స్ ఉంటున్నాయి. ఇంతవరకు ఓకె కాని... ఒకటే రకం పరిమళాన్ని సంవత్సరాల తరబడి వాడుతుంటారు కొందరు. వాస్తవానికి మీకంటూ ఒక సిగ్నేచర్ ఉండడం మంచిదే. అయితే మార్కెట్ ట్రెండ్స్‌కి తగ్గట్టుగా పర్‌ఫ్యూమ్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నపుడు ఒక్కదానికే అతుక్కుపోకుండా వేరే వాటిని కూడా ప్రయత్నించి చూడొచ్చేమో. సందర్భాన్ని బట్టి, వస్త్రధారణను బట్టి పర్‌ఫ్యూమ్‌లు వాడడం నేటి ట్రెండ్. కాని పర్‌ఫ్యూమ్ కొనేముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. స్టయిల్‌కి, స్వభావానికి సరిపడిందో, కాదో చూసి ఆ తరువాతే కొనాలి.

పర్‌ఫ్యూమ్‌ను ఎంపిక చేసుకునేముందు ముంజేతి మీద స్ప్రే చేసుకోవాలి. వెంటనే వాసన చూడకుండా పర్‌ఫ్యూమ్ ఆవిరయిన తరువాత వాసన చూడాలి. ఇలా అరగంటకి ఒకసారి చొప్పున మూడుసార్లు చూడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వెనక ఒక కారణం ఉంది. ప్రతీ అరగంటకి పరిమళాల్లో ఉండే టాప్, మిడిల్, లాస్ట్ నోట్‌లలో మార్పు గమనించొచ్చు. (సాధారణంగా నోట్స్ అనేవి సంగీతంలో వింటుంటాం. కాని పర్‌ఫ్యూమ్ తాలూకు పరిమళాలను కూడా ఇలా నోట్స్‌లోనే చూస్తారు.) ఇలా మొత్తంమీద పర్‌ఫ్యూమ్ ఎంపికకు ఒక రోజు సమయం పడుతుంది.
 

అభిరుచి, ఉష్ణోగ్రత, పరిసరాలు వంటి అంశాల ఆధారంగా పర్‌ఫ్యూమ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి లంచ్‌కో, డిన్నర్‌కో బయటికి వెళ్తున్నప్పుడు ఘాటైన వాసన ఉండే పర్‌ఫ్యూమ్‌లు పనికిరావు. వాసన ఘాటుగా ఉండడం వల్ల ఆహారం తాలూకు పరిమళం తెలియదు. అలాగే ఘాటు వాసనలకు ఆకలి చచ్చిపోతుంది. అందుకని లైట్‌గా ఉన్న పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే మంచిది.

పర్‌ఫ్యూమ్‌ను ముందుగా ముంజేతి భాగంలోనే స్ప్రే చేసుకోవాలి. అక్కడయితే పర్‌ఫ్యూమ్ బాగా వ్యాపించి దాని తాలూకు పరిమళాలు తెలుస్తాయి. దీంతోపాటు చెవి వెనక భాగాల్లో, ఛాతీ పైన స్ప్రే చేసుకోవాలి. అక్కడయితే ఎక్కువసేపు పరిమళాలు ఆస్వాదించొచ్చు.

కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...

* ఆకట్టుకునేలా ఉన్న ప్రకటనలు చూసి కొందామనే ఆలోచన విరమించుకోవాలి.
* ఏ పరిమళం ఇష్టం, ఏది కాదనే విషయాల్లో స్పష్టత ఉండాలి.
* పర్‌ఫ్యూమ్‌ను ఎంపిక చేసుకునేందుకు కావలసినంత సమయాన్ని కేటాయించగలగాలి.
* పర్‌ఫ్యూమ్‌లు చాలావరకు ఖరీదైనవే. కంపెనీని బట్టి, ఒక్కోసారి ఆ పర్‌ఫ్యూమ్‌లని ఉంచే సీసాల అందాన్ని బట్టి ఖరీదు ఉంటుంది. అందుకని ధర గురించి కాకుండా నచ్చిన పరిమళాన్ని కొనాలి.
* గుర్తింపు పొందిన డిపార్ట్‌మెంట్ స్టోర్స్, కెమిస్టుల వద్ద మాత్రమే కొనాలి. తక్కువకు వస్తున్నాయి కదాని నకిలీవి కొనొద్దు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top