ఒక రాత్రి మేల్కొంటే రెండు మైళ్లు నడిచినట్లే!

రాత్రి పూట మేల్కొంటే లావెక్కుతారా, బరువు తగ్గిపోతారా..? ఈ రెండు ప్రశ్నలకు చాలా రోజుల నుంచి దొరకని కచ్చితమైన సమాధానం తాజా పరిశోధనలో వెలుగు చూసింది. కొలరాడోకు చెందిన 'స్లీప్ అండ్ క్రోనో బయాలజీ లాబొరేటరీస్' చేసిన ఈ సర్వేలో కొత్త విషయాలు తెలిశాయి. సహజంగా రాత్రిపూట నిద్ర మేల్కొంటే బరువు పెరుగుతారని ప్రచారంలో ఉంది. అయితే ఈ సంస్థ కొంతమంది యువతీ యువకులను రాత్రి పూట మేల్కొనేలా చేసి.. వాళ్ల ఎనర్జీని లెక్కవేసింది. రాత్రిపూట నిద్రలేకుండా ఉన్న వాళ్లలో ఏడు శాతం ఎనర్జీ తగ్గింది.

మేల్కొన్నప్పుడు కంటే నిద్రపోయినప్పుడు శరీరంలో అవయవాలు కొంచెం ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో శక్తి అవసరం అవుతుంది. అందుకే క్యాలరీలు త్వరగా ఖర్చు అవుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ లెక్కన ఒక రాత్రి మేల్కొంటే 135 క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది రెండు మైళ్లు వాకింగ్ చేసిన దాంతో సమానం కావడం విశేషం. అయితే ఇది కేవలం పరిశోధన మాత్రమేనని, బరువు తగ్గడానికి రాత్రిపూట నిద్రమేలుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top