మొటిమలకు-వాటి మచ్చలకు, ఒత్తిడికి ఐస్ థెరపీ

ఒక్కోసారి మొటిమలు వాటి తాలూకు మచ్చలు అమ్మాయిలను తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సమస్యకు ఐస్ ముక్కలతో చెక్ పెట్టవచ్చు. మొదటి ఐస్‌ను శుభ్రమైన వస్త్రంలో తీసుకోవాలి. చుబుకం మీద వలయాకారంలో మెల్లిగా రుద్దుతూ పోవాలి. మధ్యమధ్యలో కాసేపు విరామమిస్తూ నెమ్మదిగా ముఖమంతా అప్లై చేయాలి. మొటిమలున్న ప్రాంతంలో నెమ్మదిగా ఒత్తిపెడుతూ ఐస్ ఉంచాలి. ఇలా ఓ క్రమ పద్ధతిలో చేస్తే కొన్ని రోజులకు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతే కాదండోయ్... చర్మానికి ఇది మంచి యాంటీ ఏజింగ్ కారకంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఐస్‌ను రుద్దడంవల్ల ముఖం శుభ్రపడి కాంతివంతంగా కనిపిస్తుంది.
ఒత్తిడికి ఉపశమనం: 
 ఒత్తిడితో తలనొప్పిగా ఉంటే ఐస్‌ను ముక్కలుగా చేసి వస్త్రంలో వేసి నుదురుమీద ఉంచాలి. కనురెప్పల మీద కాసేపు ఉంచితే శరీరం, మనసు ఉత్తేజిత మవుతాయి. ఈ ప్రక్రియనే ఐస్ థెరపీ అంటారు. అయితే పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సేపు ఈ థెరపీని చేయకూడదు. ముఖం పొడిబారక తడితువాలుతో సున్నితంగా తుడవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top