శరీరంలో అదనపు నీటిని తొలగించడానికి వీనోథెరపీ

'వీనోథెరపీ'- సామాన్య ప్రజానీకానికి ఇప్పటి వరకు పరిచయంలేని ఈ పేరు మెట్రో నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇవ్వనుంది. వైన్‌థెరీపీకు అసలు పేరే వీనో థెరపీ. దీని ద్వారా శరీరానికి నూతన మెరుపు తీసుకురావడానికి ఆయా స్పా నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.

ముంబైలో వీనోథెరపీని ప్రవేశ పెట్టిన ఓ కార్పోరేట్ స్పా కంపెనీ వారు కొద్ది రోజుల్లోనే చక్కని స్పందన చూశారట. దేహంలోని అదనపు నీటిని తొలగించడానికి వీనోథెరపీ ఉపయోగపడుతుందంటున్నారు. ఫలితంగా వచ్చే మార్పుతో యవ్వనం తొణికిసలాడుతుందని కూడా చెబుతున్నారు. త్వరలోనే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని తమ స్పా సెంటర్లలో వీనో థెరపీ ప్రవేశపెడతామంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top