ఆడవాళ్లకి అందమైన సవాల్...

కన్సీలర్లు, లిప్‌స్టిక్‌లు, యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, బ్లషర్స్... వాడడంలో ఎవరు ముందుంటారు... ఇంకెవరు మహిళలే అంటున్నారా... అయితే పప్పులో... కాదు కాదు బ్యూటీ జ్ఞానంలో కాలేసినట్టే... ఎందుకంటే ఈ మధ్యకాలంలో మగవాళ్లు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, కన్సీలర్లు, ఫౌండేషన్‌లు తెగ వాడేస్తున్నారట. ఏం వాళ్లకు మాత్రం అందంగా కనిపించాలని ఉండదా ఏంటి? అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.

అందంగా కనిపించేందుకు కాకుండా లోపాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే వాడుతున్నారట వాళ్లు. పర్సనల్ గ్రూమింగ్ కోసమే రోజుకి 83 నిమిషాలు కేటాయిస్తున్నారని ఒక పరిశోధనలో వెల్లడైంది. అందుకే కాబోలు ఈ మధ్య కాలంలో బ్యూటీ సెలూన్లలో పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటూ కనిపించే మగవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. క్రీమ్‌లు, కండీషనర్లు, సన్‌బ్లాక్, ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకం కూడా బాగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం మగవాళ్లకోసమంటూ షాంపూలు, ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ప్రకటనలు విడిగా కనిపించేవే కావు. ఎవరూ కూడా భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు వస్తాయని ఊహించి ఉండరు అప్పట్లో. కాని ఇప్పుడు అటువంటి ప్రకటనల్లో షారుక్‌ఖాన్, జాన్ అబ్రహాం, షాహిద్ కపూర్‌లు మోడల్స్‌గా కనిపిస్తున్నారు. 


టీవీల్లో కూడా ఈ ప్రకటనలు ప్రైంటైంలో వస్తున్నాయి. అంటే కాస్మొటిక్ ఉత్పత్తుల వాడకం ఎంత పెరిగిపోయిందో అర్ధమవుతుంది. కాస్మొటిక్ శస్త్రచికిత్సల్లోను వాళ్ల సంఖ్య పెరిగిపోతుంది. చెవి ఆకారం సరిచేయించుకునేందుకు, శరీరభాగాల్లో అధికంగా ఉన్న కొవ్వును తీయించుకునేందుకు, ఫేస్ లిఫ్ట్స్, ముక్కు సరిచేసుకోవడం వంటి సర్జరీలు చేయించుకునేందుకు కూడా వెనకాడడం లేదు వాళ్లు. అన్ని రంగాల్లో మీతో పోటీగా మేమని మహిళలు అంటుంటే... అందంలో మీతో పోటీగా మేమొస్తున్నాం అంటున్నారు మగవాళ్లు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top