టాప్‌-10 ఫైవ్‌స్టార్‌ హోటళ్ళు లాంటి విమానాలు (విలాస ప్రయాణాలు)

నేడు వివిధ ఎయిర్‌వేస్‌ విమానాలు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను తలపిస్తున్నాయి. వాటిలో వివిధ రకాల విలాసవంతమైన సౌకర్యాలను కల్పిస్తూ ప్రయాణీకులను ఎయిర్‌వేస్‌ నిర్వాహకులు మైమరపిస్తున్నారు. అబ్బురపరిచే ఇంటీరియర్‌తో రూపుదిద్దుకున్న ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌లో చక్కటి భోజనం, కాక్‌టైల్స్‌ సరఫరాతో పాటు ఎయిర్‌ హోస్టెస్‌ల మర్యాదలు ప్రయాణీకులను మరో లోకంలో విహరిపంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా ఎయిర్‌వేస్‌ ప్రయాణికులకు అందిస్తోన్న ఉత్తమ సేవలు, లగ్జరీ సౌకర్యాల ఆధారంగా ఇటీవల ప్రముఖ పత్రిక ఫోర్బ్‌‌స టాప్‌-10 విమానయాన సంస్థలను ప్రకటించింది. 

అన్ని విమానాల్లో పవళించడానికి పాన్పులు ఉండకపోవచ్చు కానీ ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో లభించే సౌకర్యాలు ఉంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థ లు తమ ఫ్టైట్లలో విలాస జీవితాన్ని కోరుకునే జల్సారాయుళ్లకు, డబ్బుకు వెనకాడని ధనవంతులకు ఎన్నో రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఈ మేరకు విలాసవంతమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఫోర్బ్‌‌స సంస్థ పది ఎయిర్‌వేస్‌తో జాబితాను విడుదల చేసింది.  


1.కతార్‌ ఎయిర్‌వేస్‌...
ఈ విమానయాన సంస్థ నడిపే విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికుల కో సం ప్రత్యేక టెర్మినల్‌ కేటాయించారు. ఒకవేళ విమానం అనివార్య కారణా ల వల్ల మధ్యలో గంటల పాటు ఆగినా ఆ ప్రయాణికులకు దగ్గరలోని సం స్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఫైవ్‌స్టార్‌ హోటల్లో వసతి ల్పిస్తారు. ఇం దులో స్పా, బార్‌లు, ఆసుపత్రులు ఉంటాయి. విమానంలో దాదాపు 79 అంగుళాల మెత్తటి పుష్‌బ్యాక్‌ సీట్లు ప్రయాణికులకు అలసట లేకుండా చే స్తాయి. దాదాపు 24 అంగుళాల టేబుల్‌పై ఇద్దరు ప్రయాణికులు సీట్లో కూర్చొని ఎంచక్కా డిన్నర్‌ చేసే వీలుంది.

2. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌...
ఆతిథ్యానికి మారుపేరైన ఈ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో ప్రయాణికులు ని స్సంకోచంగా షాంపేన్‌, విస్కీ, రమ్‌, బీరు ఇలా ఏది కావాలంటే అది ఆర్డర్‌ చేయవచ్చు. ఇదే కాదు మీకు నచ్చిన ఆహారాన్ని లొట్టలేస్తూ లాగించవచ్చు. 84 అంగళాల సీట్లపై ఇంట్లో పడుకున్న ఫీలింగ్‌తో హాయిగా నిద్రపోవచ్చు.

3.కేథే పసిఫిక్‌...

స్టార్‌ హోటళ్లలో ఉండే సూట్‌ రూం వాతావరణం కోరుకునే వారికి ఈ ఎయిర్‌లైన్స్‌ మించిన సంస్థ మరొకటి లేదు. ఈ విమానాల్లో ఉన్న సీట్లకు స్లైడింగ్‌ ప్యా నల్‌ను అమర్చారు. వీటి సహాయంతో సీట్లను మీకు కావల్సిన రీతిలో మార్పులుచేర్పులు చేయవచ్చు. 81 అంగుళాల సీట్లలో హా యిగా పవళించి అలసట దూరంచేసుకోవడానికి మసాజ్‌ చేసే ఏర్పాట్లు ఇందులో ఉండటం మరో విశేషం.

4. మలేషియా ఎయిర్‌లైన్స్‌... 

యాత్రికులను ఉత్సాహంగా, ఉల్లాసంగా స్వాగతం పలికే ఈ ఎయిర్‌లైన్స్‌ కు సాటి వేరొకటి లేదు. ఈ సంస్థ విమానాల్లో సీట్లు బెడ్‌ల మాదిరిగా మార్చుకునే వీలుంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విమాన ప్ర యాణికుల కోసం విలాసవంతమైన సౌకర్యాలుండే లాంజ్‌, రెస్టారెంట్‌లు అందుబాటులో ఉంచింది.

5.థాయ్‌ ఎయిర్‌లైన్స్‌...
యాత్రికులను వ్యక్తిగతంగా స్వాగతించడానికి ఎయిర్‌హోస్టెస్‌లు అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు చెక్‌ ఇన్‌ అయ్యే వరకు వారికి సపర్యలు చేసేందుకు ప్రత్యేక సిబ్బంది వారి వెంటే ఉంటారు. ఈ సంస్థ విమానాశ్రయాల్లో ఉండే లాంజ్‌లలో సోనా, స్పా, మసాజ్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.

6.ఎమిరేట్స్‌ ఎయిర్‌వేస్‌...
ఈ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో ప్రతి సీటు పక్కన ఉండే స్లైడింగ్‌ డోర్‌ సహాయంతో ప్రత్యేక గదిలా మార్చుకోవచ్చు. ఎంపిక చేసిన విమానాశ్రయాల నుండి యాత్రికులను గమ్యస్థానం చేరవేసేందుకు ప్రత్యేకంగా లగ్జరీ కార్లను అందుబాటులో ఉంచారు.

7.జెట్‌ ఎయిర్‌వేస్‌...

ఇందులో ప్రయాణించే యాత్రికులకు 83 అంగుళాల విశాలమైన సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి సీటు వెనక ఉండే 24 అంగుళాల ఫ్లాట్‌ స్క్రీన్‌ టివి కమ్‌ హోమ్‌ థియేటర్‌లో మీకు నచ్చిన సినిమాను చూడవచ్చు. దీంతో పాటు నచ్చిన డ్రింక్‌, భారతీయ, పాశ్చాత్య వంటకాలను ఆర్డర్‌ చేయవచ్చు.

8.లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌..
ఈ సంస్థ విమానాల్ని నడిపే విమానాశ్రయల్లో అడుగిడగానే ఎయిర్‌హోసె్‌‌ట స్‌లు మీ సేవకై ప్రత్యక్షం అవుతారు. సెక్యూరిటీ చెక్‌ పూర్తికాగానే మిమ్మల్ని లాంజ్‌కు తీసుకెళ్తారు. లాంజ్‌లో మీకు నచ్చిన భోజనాన్ని ఆర్డర్‌చేయవ చ్చు. లాంజ్‌ నుండి విమానం మెట్ల వరకు మెర్సిడిస్‌ బెంజ్‌ కారులో ప్రతి ప్రయాణికుడ్ని తీసుకెళ్తారు.

9.కొరియన్‌ ఎయిర్‌లైన్స్‌...
ఈ సంస్థ మొదటి శ్రేణి కేబిన్‌లో ప్రైవేట్‌ సూట్‌ వాతావరణం ఉంటుంది. రుచికరమైన వంటకాలు ఈ సంస్థకు మరింత వన్నె తెచ్చాయి.

10. కంటాస్‌ ఎయిర్‌లైన్స్‌...
సిడ్నీ, మెల్‌బోర్న్‌లో ఈ సంస్థ లాంజ్‌లలో గ్రంథాలయాలు,రెస్టారెంట్లు, స్పా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచింది. 6.5 అడుగుల సీట్లలో ఎంచక్కా పడుకునే వీలుంది. ప్రతి సీటు వెనుక అమర్చిన ఫ్లాట్‌ స్క్రీన్‌ తెరపై 400 ఛానెళ్లలో మీకు నచ్చిన టీవీ ఛానెల్‌ను వీక్షించవచ్చు.     
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top