కావల్సినవి:
బేబీకార్న్ ముక్కలు, పనీర్ తురుము - కప్పు చొప్పున, టమాటా ముక్కలు - కప్పున్నర, ఉల్లిపాయలు - రెండు, క్యాప్సికం - రెండు, ఉప్పు, కారం - రుచికి తగినంత, జీలకర్ర పొడి - చెంచా, నూనె - కొద్దిగా.
తయారీ:
బేబీకార్న్ ముక్కల్ని ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కల్ని వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకున్న బేబీకార్న్, టమాటా ముక్కల్ని ఇందులో వేసి మూత పెట్టేయాలి. క్యాప్సికం కొద్దిగా మగ్గినట్లు అయ్యాక కారం, జీలకర్ర పొడి వేయాలి. గ్రేవీ తయారవుతుండగా పనీర్, తగినంత ఉప్పు కలపాలి. ఐదునిమిషాల తరవాత దింపేస్తే సరిపోతుంది. వేడివేడి బేబీకార్న్ పనీర్ సిద్ధం.