క్యాలీఫ్లవర్‌ పకోడీ


కావల్సినవి: 
క్యాలీఫ్లవర్‌- రెండు కప్పులు(పువ్వులుగా విడదీయాలి)
పసుపు- చిటికెడు
నూనె- వేయించడానికి సరిపడా
మైదా, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి- అన్నీ కలిపి అరకప్పు చొప్పున
ఉప్పు, కారం- తగినంత


తయారీ:
మైదా, బియ్యం, మొక్కజొన్న పిండి.. అన్నింటినీ కలిపి ఓ గిన్నెలో తీసుకోవాలి. అందులో కాసిని నీళ్లు పోసి, ఉప్పు , పసుపు, కారం చేర్చి పకోడీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరవాత విడదీసిన క్యాలీఫ్లవర్‌లో తగినన్ని నీళ్లు పోసి, చిటికెడు ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక.. పిండిలో ముంచిన పువ్వులను గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. అంతే వేడివేడి క్యాలీఫ్లవర్‌ పకోడీలు తయారయినట్టే. వీటిని టమాటాసాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top