ఉమెన్స్ కాలేజీ లాబ్‌లో కలుస్తుంది.......

ఒక మడుగులో కప్ప ఒకటి ఒంటరిగా జీవించేది. ఒకరోజు దానికి తన జీవితం మీద విసుగు పుట్టింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. ఫోన్‌లో భవిష్యవాణి చెప్పే నంబరుకు ఫోన్ చేసింది.
‘‘రాబోయే రోజుల్లో మీకు ఏ దిగులూ ఉండదు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అతి త్వరలో మీరు ఒక అందమైన అమ్మాయిని కలుసుకోబోతున్నారు. ఆమె మీ గురించి అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంది’’ అని అవతలి వైపు నుంచి వినిపించింది.
కప్ప ఎంతో సంతోషపడిపోతూ ‘‘అవునా?! ఆ అమ్మాయి నన్ను ఎక్కడ కలుస్తుంది ? పార్టీలోనా ?’’ అని అడిగింది.
‘‘ఉమెన్స్ కాలేజీ లాబ్‌లో’’ అవతలివైపు నుంచి నెమ్మదిగా వినిపించింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top