ఎగ్‌ పిజ్జా


కావల్సినవి: 
గుడ్లు- మూడు
క్యారెట్‌- రెండు
బంగాళాదుంపలు- మూడు
అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- నాలుగు
కరివేపాకు- నాలుగు రెబ్బలు
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు, కారం- రుచికి తగినంత
నూనె- నాలుగు చెంచాలు
వెన్న- కొద్దిగా
బ్రెడ్‌ముక్కలు- ఆరు

తయారీ: 
 ముందుగా గుడ్లను పగలగొట్టి అందులో ఉప్పు, కారం కలిపి బాగా గిలక్కొట్టాలి. కుక్కర్‌కు విజిల్‌ పెట్టకుండా సొనను ఉడికించి దించేస్తే అది జున్నులా తయారవుతుంది. దాన్ని ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి. తరవాత పచ్చిమిర్చి, క్యారెట్‌, ఉల్లిపాయలు, కొత్తిమీరను సన్నగా తరిగి ఉంచుకోవాలి. బంగాళాదుంపలను ఉడికించి చల్లారాక మెత్తగా చేయాలి.

ఇప్పుడు బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక క్యారెట్‌, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసి కొంచెం మగ్గించి ఉప్పు, బంగాళాదుంప ముద్ద, సొన ముక్కలు కలపాలి. మరికొద్దిసేపటికి కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి సన్నటి మంట ఉంచి మూత పెట్టాలి. ఇప్పుడు అంచులు తీసిన బ్రెడ్‌కు వెన్న రాసి గుడ్డుకూరను దానిమీద పరచాలి దానిపైన మరొక బ్రెడ్‌ను ఉంచాలి. ఇప్పుడు ఈ ముక్కలను నూనె వేసి పెనం మీద కాల్చాలి. అంతే నోరూరించే ఎగ్‌ పిజ్జా తయారయినట్టే. 

ఎగ్‌బోండా ఇష్టపడే వారు సెనగపిండిని పకోడీల పిండిలా కలిపి అందులో ముంచి నూనెలో వేయించుకుంటే అవి సిద్ధమవుతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top