నిర్జీవంగా లేకుండా మెరిసే చర్మం కోసం జ్యూసులు

టమాటా : 
టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది.అలాగే ఇది రక్తా న్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభి స్తాయి. 
క్యారెట్‌ :
తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్‌లో పోషకాలు కూడా ఎక్కువే. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో వుండే విటమిన్‌ ఏ, సిలు చ ర్మానికి తేజస్సును ఇస్తాయి. కళ్లకు కూడా ఎంతో మంచిది. 

జామకాయతో :
జామకాయలో వుండే పో షకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సం తరించుకుంటుంది.  

ఆపిల్‌ :
రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవ డం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవ చ్చు. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి. 

బీట్‌రూట్‌ :
లివర్‌కు మంచిది. కిడ్నీ లను శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలి నాలను తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. చర్మాన్ని మెరి సేలా చేస్తుంది. రుచికి కాస్త భిన్నంగా వున్నప్పటికీ ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ దుంప. 

పుచ్చకాయ :
90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top