బ్రెడ్‌తో ఆమ్లెట్‌


కావల్సినవి: 
కోడిగుడ్లు - రెండు; ఉప్పు - చిటికెడు; మిరియాలపొడి - చెంచా; పాలు - రెండు చెంచాలు; నెయ్యి - రెండు చెంచాలు, బ్రెడ్‌స్త్లెసు - ఒకటి.

తయారీ: 
ఓ గిన్నెలో గుడ్ల సొనను తీసుకుని బాగా గిలక్కొట్టాలి. పాలు చేర్చి మరోసారి కలపాలి. తరవాత ఉప్పు, మిరియాల పొడి వేయాలి. పెనం బాగా కాలిన తరవాత నెయ్యి వేసి అది పెనమంతా పరచుకునేలా అట్లకాడతో రాసినట్లు చేయాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పెనంపై వేయాలి. ఇది దోశలా అంతటా పరచుకునేలా పెనాన్ని అటూఇటూ తిప్పాలి. బాగా కాలాక తిరగేయాలి. నిమిషం తరవాత నాలుగు మడతలుగా చేసుకుని పళ్లెంలోకి మార్చుకుని మధ్యలో బ్రెడ్‌స్త్లెసు ఉంచితే చాలు. బ్రెడ్‌ ఆమ్లెట్‌ నోరూరిస్తుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top