టమాటా మసాలా బజ్జీ


కావల్సినవి:
టమాటాలు- అరకేజీ (అన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి)
బంగాళాదుంపలు - అరకేజీ
నూనె - వేయించడానికి సరిపడా
 గరంమసాలా - రెండుచెంచాలు
కొత్తిమీర - కప్పు
పెసరపప్పు - నాలుగు చెంచాలు
ఉల్లిపాయలు - మూడు
పచ్చిమిర్చి - నాలుగు
సెనగపిండి - కప్పు.

తయారీ:
టమాటాలను శుభ్రంగా కడిగి పైభాగంలో చిన్న గాటు పెట్టి లోపలి గుజ్జు, విత్తనాలను తొలగించి మరో కప్పులోకి తీసుకోవాలి. పెసరపప్పు, బంగాళాదుంపల్ని విడివిడిగా ఉడికించి పెట్టుకోవాలి. చల్లారాక బంగాళాదుంపల చెక్కు తీసి మెత్తగా మెదిపి అందులో పెసరపప్పు, గరంమసాలా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుములను కలిపి ఒకసారి మిక్సీలో వేసి తిప్పాలి. ఈ మిశ్రమాన్ని చెంచాతో టమాటాలలోకి కూరాలి.  


సెనగపిండిలో సరిపడా నీళ్లు పోసి బజ్జీలపిండిలా కలపాలి. బాణలిలో నూనె వేడిచేయాలి. మసాలా కూరిన టమాటాలను సెనగపిండిలో ముంచి నూనెలో గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. అంతే వేడివేడి టమాటా మసాలా బజ్జీ సిద్ధమయినట్టే. వీటిని పుదీనాచట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top