తిండి తులాభారం

కొందరికి కారం కారంగా మాత్రమే తినాలనిపిస్తుంది. కొందరికి నూనెలో వేగిన పదార్ధాలంటే అమిత ప్రీతి. మరికొందరికి స్వీట్లు తినాలనే కోరిక ఎంత అణుచుకోవాలన్నా అణిగిపోదు. ఇక మగమహారాజులకయితే నిత్యం గుప్పు గుప్పున పొగ ఊదాలనో, మందు తాగాలనో అనిపిస్తూనే ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకేమిటి అప్పుడప్పుడు అలా అనిపిస్తుందంతే అంటున్నారా. అది నిజం కాదు. కారణం లేకుండా ఇలా జరగదు. శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కొన్ని లోపించడం వల్ల ఇలాంటి కోరికలు పుట్టుకొస్తాయి. ఏ లోపం వల్ల ఏమి తినాలనిపిస్తుందో ఇక్కడ ఇస్తున్నాం చెక్ చేసుకోండి.
  •   చాకొలెట్ తినాలనిపిస్తే.. మీలో మెగ్నీషియం లోపం ఉన్నట్టు. ఈ లోపాన్ని అధిగమించేందుకు.పచ్చి కాయగూరలు, విత్తనాలు, గింజధాన్యాలు, పళ్లు తినాలి.
  • బాగా స్వీట్లు తినాలనిపిస్తుందనుకోండి... క్రోమియం, కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ట్రిప్టోఫాన్‌ల శాతం తగ్గిపోయినట్టు లెక్క. క్రోమియం కోసం బ్రకోలి, ద్రాక్ష, చీజ్, బీన్స్, లివర్, చికెన్ తినాలి. కార్బన్ లోపాన్ని అధిగమించేందుకు... తాజా పళ్లు తీసుకోవాలి. ఫాస్ఫరస్ కోసం కోడి, బీఫ్, లివర్, చేప, గుడ్లు, పాలు, నట్స్, గింజధాన్యాలు తినాలి. సల్ఫర్ కోసం... క్యాబేజి తినాలి. ట్రిప్టోఫాన్ లోపం కోసం... చీజ్, లివర్, లాంబ్, ఎండుద్రాక్ష, చిలకడదుంప, బచ్చలికూర తినాలి.
  •   ఒక్కోసారి బ్రెడ్, టోస్ట్ తినాలనిపిస్తుంటుంది... దీనికి కారణం నైట్రోజన్ లోపం. ఇందుకోసం అధిక ప్రోటీన్ ఉన్న పదార్ధాలు అంటే చేప, మాంసం, కాయగూరలు, బీన్స్ తినాలి.
  • నూనె పదార్ధాలు, ఫ్యాటీ ఫుడ్స్ తినాలనిపిస్తే... కాల్షియం లోపం ఉందని. దీనికోసం ఆవాలు, టర్నిప్ గ్రీన్స్, బ్రకోలి, కాయధాన్యాలు, చీజ్, నువ్వులు తినాలి.
  • కాఫీ, టీలు ఎక్కువగా తాగాలనిపిస్తే... ఫాస్ఫరస్, సల్ఫర్, ఉప్పు, ఐరన్ లోపాలు ఉన్నట్టు. ఈ లోపాన్ని అధిగమించేందుకు కోడి, బీఫ్, లివర్, గుడ్లు, పాలు, నట్స్, చిరు ధాన్యాలు తినాలి.
  • ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్ వంటివి తీసుకోవాలనిపిస్తుంటే కనుక ప్రొటీన్, అవెనిన్, కాల్షియం, గ్లుటామిన్, పొటాషియంలు అవసరం అన్నమాట.
  • పొగతాగాలనిపించే ఆలోచన సిలికాన్, టైరోసిన్ లోపం వల్ల వస్తుంది. సిలికాన్ కోసం నట్స్, సీడ్స్, తింటూ, రిఫైన్ చేసిన స్టార్చ్ పదార్ధాలను మానేయాలి. టైరోసిన్ కోసం.. విటమిన్ సి సప్లిమెంట్ లేదా నారింజ, ఆకుపచ్చ, ఎరుపు రంగుల పళ్లు, కూరగాయలు తినాలి.
  •   ఐస్‌క్యూబ్స్ నమిలేయానిపిస్తుంటుంది కొందరికి. ఇది ఎనీమియా ఉందనడానికి సంకేతం. ఐరన్ లోపం వల్ల ఎనీమియా వస్తుందనే విషయం తెలిసిందే. అలాగే గ్రిల్డ్ ఫుడ్ తినాలనిపిస్తే... కార్బన్ లోపం ఈ రెండు లోపాల కోసం తాజా పళ్లు తినాలి.
  • సోడా, ఇతర కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగాలనిపిస్తే... కాల్షియం లోపం. ఇందుకు మేక పాలు పచ్చివి తాగాలి, చేప తినాలి వాడాలి.
  • కూల్‌డ్రింక్స్ తాగాలనిపిస్తుంటే మాంగనీస్ లోపం... ఇందుకు వాల్‌నట్స్, ఆల్మండ్స్, పనస, నల్ల ద్రాక్ష ఎక్కువగా తినాలి.
  • ఇవన్నీ ఒక ఎత్తయితే... కొందరు ఎక్కువగా తింటుంటారు. దీనికి కారణం సిలికాన్, ట్రిప్టోఫాన్, టైరోసిన్‌లు లోపం. సిలికాన్ లోపం నుంచి బయటపడేందుకు నట్స్, సీడ్స్ తినాలి. రిఫైన్డ్ స్టార్చ్ తినకూడదు. ట్రిప్టోఫాన్ కోసం... చీజ్, లివర్, లాంబ్, ఎండుద్రాక్ష, స్వీట్ పొటాటో, స్పినాచ్‌లు తినాలి.టైరోసిన్ కోసం... విటమిన్ సి సప్లిమెంట్‌లు లేదా నారింజ, ఆకుపచ్చ, ఎరుపు రంగుల పళ్లు, కూరగాయలు తినొచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top