మష్రూమ్ పాపడ్ రోల్స్


కావలసిన పదార్థాలు
బటన్ మష్రూమ్స్(సన్నగా తరిగినవి) - ఒక కప్పు, జీడిపప్పు - 50గ్రా, క్యారెట్ తురుము - రెండు టేబుల్ స్పూన్‌లు, పచ్చి కొబ్బరి - రెండు టేబుల్ స్పూన్‌లు, గ్రీన్ పీస్ - పావు కప్పు, మసాలా పాపడ్ - ఆరు, పుదీనా, కొత్తిమీర, క్యాలీఫ్లవర్(తురుము) - అర కప్పు, గరంమసాలా - ఒక టీ స్పూన్, చాట్ మసాలా - అర టీ స్పూన్, మిరపపొడి, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా, నిమ్మకాయ - ఒకటి. ఉల్లిపాయలు- రెండు.


తయారుచేయు విధానం
ముందుగా మష్రూమ్స్‌ని నిమ్మరసం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తరువాత గ్రీన్‌పీస్‌ని, క్యాలీఫ్లవర్‌ని కూడా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మష్రూమ్స్, గ్రీన్‌పీస్, పుదీనా, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు వేసుకోవాలి. అందులో గరంమసాలా, ఛాట్ మసాలా, మిరపపొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కొన్ని నీళ్లుపోసుకుని అప్పడాలను అందులో ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక్కో అప్పడంలో ముందుగా వేయించిపెట్టుకున్న మిశ్రమంను పెట్టి రోల్ చేయాలి. రెండు పక్కలా మైదాతో మూసేయాలి. తరువాత నూనెలో వేయించాలి. చివరగా క్యారెట్‌తురుము, పచ్చి కొబ్బరితురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే... మష్రూమ్ పాపడ్ రోల్స్ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top