హీరో చస్తే సినిమా హిట్టవ్వదంటే మా అప్పల్రాజు చస్తే ఒప్పుకోడు !


రాంగోపాల్‌వర్మ.. సంచలనానికి ఓ పర్యాయపదం. తెలుగు సినిమాకు ఓ నూతన పధం. తనకు, తన సినిమాలకు ఎలా ప్రచారం కల్పించాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు’ ఈ రోజు  విడుదల అవుతుంది. హీరో చచ్చిపోతే సినిమా హిట్టవ్వదంటే చస్తే ఒపుకోకపోవడం అప్పల్రాజు ప్రత్యేకతల్లో ఒకటని ఆయన చెబుతున్నారు!

ఎవరైనా ఓ కుర్రాడు..ఏదైనా పెద్ద కంపెనీ పెడతాననో, పరిశ్రమ పెడతాననో అనుకోడు. సినిమా అయితే ఈజీగా తీసేస్తానని అనుకుంటాడు. సినిమా చూసినంత ఈజీగా సినిమా తీసెయ్యొచ్చనీ భావిస్తాడు. అప్పల్రాజూ అంతే. మూర్ఖుడికి పర్యాయం అప్పల్రాజు.  అప్పల్రాజు ఓ దర్శకుడిగా ఎంతసేపూ సినిమాని విమర్శనాత్మకంగా చూస్తాడు. వేరేవాళ్లకంటే..తనే బాగా తీస్తానని అనుకుంటుంటాడు. ‘హీరో చనిపోతే సినిమా ఆడదు’ అనేది టాలీవుడ్‌ వ్యూ ఆఫ్‌ పాయింట్‌. హీరో పోయినా..‘దేవదాసు’ ఎందుకు హిట్టయ్యింది అనేది అప్పల్రాజు పాయింటు!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top