ముందు కృష్ణుడి జన్మస్థలం చూపిస్తా పద!

రైలు శరవేగంగా వెళుతోంది. ఓ కంపార్ట్‌మెంట్‌లో అందరితోపాటు ఓ సాధువు కూడా కూర్చుని ఉన్నాడు. ఇంతలో టికెట్ కలెక్టర్ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. అందరి టికెట్లు తనిఖీ చేసి ఆఖర్న సాధువు వద్దకు వచ్చాడు.
టికెట్ కలెక్టర్ : ఏవయ్యా.. నిన్నే.. ఎక్కడికి వెళ్తున్నావు?
సాధువు : రామ జన్మభూమికి వెళ్దామని..
టికెట్ కలెక్టర్ : టికెట్ చూపించు...
సాధువు : తీసుకోలేదు సార్..
టికెట్ కలెక్టర్ : అయితే నాతో రా..
సాధువు : ఎక్కడికి సార్..
టికెట్ కలెక్టర్ : ముందు కృష్ణుడి జన్మస్థలం చూపిస్తా పద!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top