పాలక్ టిక్కీ విత్ వెజిటబుల్స్


కావలసిన పదార్థాలు :
పాలకూర-1 కట్ట, ముల్లంగి-1(చిన్నది), క్యారెట్-1, ఉడికించిన బంగాళదుంపలు-2, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్-1 టీస్పూన్, వేరుసెనగపప్పు-పావు కప్పు, నూనె-1 టేబుల్ స్పూన్, ఉప్పు-రుచికి సరిపడా. 

తయారుచేసే విధానం :
పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. క్యారెట్, ముల్లంగి, బంగాళదుంపలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వేరుశెనగ పప్పును వేగించి మిక్సీలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలి. దీంతో అది కాస్త కచ్చాపచ్చాగా అవుతుంది. ఇప్పుడు స్టవ్‌పై ఒక బాణలి ఉంచి అందులో నూనె వేసి అది వేడెక్కాక పాలకూర, ముల్లంగి, క్యారెట్, బంగాళ దుంప ముక్కలు వేసి కాసేపు వేగించిన తర్వాత అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, వేరుసెనగపప్పు ముద్ద వేసి బాగా కలపాలి. చల్లారాక చేతితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు లేదంటే బిస్కెట్ల మాదిరిగానూ చేసుకోవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top