కావలసినవి:
పనీర్-కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద-టీ స్పూన్
బ్రెడ్ పొడి-కప్పు
గరం మసాలా-టీ స్పూన్
కార్న్‌ఫ్లోర్-టీ స్పూన్
పండుమిర్చి తరుగు-5 టీ స్పూన్లు
నూనె-డీప్ ఫ్రైకి సరిపడా
కొత్తిమీర తరుగు-2 టీ స్పూన్లు
పసుపు-చిటికెడు, ఉప్పు-తగినంత
జీలకర్ర పొడి-టీ స్పూన్
తయారి:
ముందుగా పాన్‌లో తగినంత నీరు పోసి అందులో పనీర్ వేసి అయిదారు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒక గిన్నెలో ఉడికించిన పనీర్‌ని వేసి మెత్తగా చిదిమి అందులో కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, పండుమిర్చి తరుగు, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, బ్రెడ్ పొడి వేసి చపాతీ పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కనపెట్టుకోవాలి. బాణలిలో సూనె కాగిన తర్వాత వీటిని అందులో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి టిష్యూపేపర్ మీదకు తీసుకోవాలి. వీటిని టొమాటో సాస్ లేదా చిల్లీ సాస్తోతింటే రుచిగా ఉంటాయి.