'ఢీ' కంటే ఓ మెట్టు పైనే ఉంటుంది'వస్తాడు నా రాజు' - మంచు విష్ణు


"ఈ సినిమా మీద చాలా ఆశలున్నాయి. 'ఢీ' కంటే కమర్షియల్‌గా ఓ మెట్టు పైనే ఉంటుంది'' అని చెప్పారు మంచు విష్ణు. నిజానికి ఈ కథ ఇద్దరు ముగ్గురు హీరోల వద్దకు వెళ్లి, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చింది. 'వాంటెడ్'తో దర్శకుడిగా మారిన రచయిత బీవీఎస్ రవి ఈ కథ నాకైతే బాగుంటుందని చెప్పి, హేమంత్ మధుకర్‌ని నా వద్దకు పంపించాడు.


హీరో క్యారెక్టరైజేషన్, అందులోని హ్యూమర్ నాకు బాగా నచ్చాయి. దీన్ని అందమైన లవ్ స్టోరీ ఉన్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. 'నొప్పింపక తానొవ్వక.. ధన్యుడు సుమతీ' అనే సుమతీ శతక పద్య సారాంశమే ఈ సినిమాలో నేను చేసిన హీరో పాత్ర. నా కెరీర్‌లో ఇప్పటివరకు బెస్ట్ ఫిల్మ్ అయిన 'ఢీ' స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.

అతని సత్తా అర్థమైంది సినిమాలో నేను కిక్ బాక్సర్‌గా కనిపిస్తా. కిక్ బాక్సింగ్‌లో ఛాంపియన్ కావాలనేది నా లక్ష్యం. హీరోయిన్ తాప్సీ మెడికల్ స్టూడెంట్. ఆమె వీక్‌నెస్ ఆమె అన్నే. ఆయన ఎంత చెబితే అంత. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్ చేశారు. నేను బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకుని నా ప్రేమ కథ నడిపిస్తా. డైరెక్టర్ హేమంత్ బ్రహ్మాండంగా కథ నడిపాడు.
సినిమా అంతా ఎంజాయ్ చేస్తూ చేశా. ఫ్రమ్ ద బిగినింగ్.. 'సలీమ్'కి అలా ఎంజాయ్ చేయలేకపోయా.

కెరీర్ బెస్ట్ మ్యూజిక్ మణిశర్మకి వంద శాతం థాంక్స్. నా కెరీర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ట్యూన్స్ విషయంలో నా జోక్యం సున్నా. మణిశర్మతో కూర్చుని హేమంత్ ఆ ట్యూన్స్ సెలక్ట్ చేసుకున్నాడు. నాకు భాస్కరభట్ల రాసిన మెలోడీ 'కలగనేవేళ' అంటే బాగా ఇష్టం. ఆ తర్వాత మాస్ సాంగ్ 'సడేమియా సడేమియా' బాగా నచ్చింది.


నాన్నకి బాగా నచ్చింది సినిమా చూసి ఈ నాలుగైదేళ్లలో ఇంత రిలాక్స్‌డ్‌గా లేవు అన్నారు నాన్న. ఆయనకి సినిమా బాగా నచ్చేసింది. సెన్సార్ వాళ్లు 'చాలా చాలా బాగుంది' అన్నారు. 'సలీమ్'కి తేడా కొట్టింది కానీ, 'వస్తాడు నా రాజు' మీద చాలా ఆశలున్నాయి. 'ఢీ' కంటే కమర్షియల్‌గా ఇది పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. దాని కంటే ఓ మెట్టు పైనే ఉంటుంది కానీ తక్కువగా ఉండదు. ఐ వాంట్ టు బి ద బెస్ట్. అందుకే ఓ దీక్షతో ఈ సినిమా చేశా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top