కావలసిన పదార్థాలు
ఓట్స్ - ఒక కప్పు, క్యారెట్స్, బీన్స్, క్యాప్సికమ్(తరిగినవి) - ఒక కప్పు, పచ్చి మిర్చి, అల్లం, ఉల్లిపాయలు - తగినన్ని, శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర - పోపుకు తగినన్ని, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - అర కట్ట, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేయు విధానం
ముందుగా ఓట్స్ను నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. తరువాత ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు గింజలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు, మిర్చి, అల్లం, కూరగాయల ముక్కలు, కరివేపాకు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. తరువాత సరిపడా నీళ్లుపోసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. నీరు మరుగుతుండగా వేయించిపెట్టుకున్న ఓట్స్ వేసి బాగా కలిపి మూతపెట్టాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి. అంతే...ఓట్స్ ఉప్మా రెడీ.