మొటిమలకు ప్యాక్...హైటెక్ స్కిన్ ప్యాచ్'

అమ్మాయిల మొహానికి దిష్టిచుక్కలేవంటే ఎవరైనా టక్కున చెప్పేస్తారు మొటిమలని. అవి రాకుండా ఉండటానికి, వస్తే వెంటనే పోడానికి చేయని ప్రయత్నాలుండవు. రకరకాల సబ్బుల నుంచి సర్జరీల వరకూ అన్ని ట్రై చేసి విసిగిపోయిన అమ్మాయిలెందరో. అలాంటివారికి ఒక శుభవార్త చెబుతున్నారు ఇజ్రాయిల్ పరిశోధకులు. 'హైటెక్ స్కిన్ ప్యాచ్' పేరుతో వారు తయారుచేసిన ప్యాక్‌లు మొటిమల్ని ఇట్టే మాయం చేస్తాయంటున్నారు.

దెబ్బ తగిలినపుడు వేసుకునే ప్యాక్‌లా ఉండే ఈ చిన్ని ప్యాక్‌లు మొటిమలపై అంటించుకుంటే చాలు. వాటిలో ఉండే విద్యుత్ వల్ల మొటిమ మూడు రోజుల్లో మచ్చతో సహా మాయమవుతుందట. అయితే ఈ ప్యాక్‌లు మన వారి మొహాలకి అంటుకోడానికి (అంటే మన దేశం రావడానికి) దాదాపు రెండేళ్లు పట్టొచ్చని వీటిని తయారుచేసిన కంపెనీవారు చెబుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top