మీల్ మేకర్ పకోడీ


కావలసిన పదార్థాలు
మీల్‌మేకర్ - 100గ్రా, కార్న్‌ఫ్లోర్ - అర కప్పు, బియ్యప్పిండి - అర కప్పు, శనగపిండి - అర కప్పు, ఉల్లిపాయలు - రెండు, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - పావు కప్పు, కరివేపాకు - పావు కప్పు, నూనె - సరిపడా, మిరపపొడి - ఒక స్పూన్, ఉప్పు - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్‌లు.
 తయారుచేయు విధానం
ముందుగా ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లుపోసి మరిగించుకోవాలి. అందులో మీల్‌మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక అరగంట సేపు వాటిని నీళ్లలోనే ఉంచుకోవాలి. తరువాత వేరే పాత్రలోకి మీల్‌మేకర్‌ని తీసుకుని మెత్తగా చేయాలి. అందులో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరపపొడి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక పాత్రలో నూనె పోసి కాస్త వేడి అయ్యాక పకోడీల మాదిరిగా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే... మీల్ మేకర్ పకోడీ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top