హార్స్ రైడింగ్‌తో 'ఫిట్' - కత్రినా

పోలో గేమ్‌లో గుర్రపు స్వారీ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అల్లంత దూరన గుర్రాలు వేసే అందెలు... కళ్లెం చేతిలో పట్టుకుని రౌతు స్వారీ చేస్తుంటే చూసేవారికి చూడ ముచ్చటగాఉంటుంది. ఇలాంటి విన్యాసాలను వెండి తెరపై కూడా చూస్తుంటాం. హీరో గుర్రం మీద స్వారీ చేస్తూ రౌడీలతో చేసే ఫైటింగులు బోలెడన్నీ సిల్వర్ స్క్రీన్ మీద చూశాం.

ఈ మధ్య వచ్చిన మగధీరలో రామ్ చరణ్ చేసిన గుర్రపు స్వారీ కుర్రకారులో మరింత క్రేజ్ తెచ్చింది. ఇలా వృత్తిలో భాగంగా హీర్స్ రైడింగ్ నేర్చుకునే వారు కొందరైతే... చాలా మంది సరదా కోసం కూడా హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు. కానీ బాలీవుడ్ సెక్సీ బాంబ్ కత్రినా మాత్రం గుర్రపు స్వారీని తన ఫిట్‌నెస్‌కోసం ఉపయోగించుకుంటోంది.

ఓ అరగంట పాటు గుర్రపు స్వారీ చేయడం వల్ల బోలెడంత ఫిట్‌నెస్ సాధించవచ్చు అంటోంది ఈ చురకత్తిలాంటి చూపుల చిన్నది. 'నేను ఉదయం, సాయంత్రం తప్పకుండా హార్స్‌రైడింగ్ ఓ అరగంటపాటు చేస్తా.

దీని వల్ల శరీరానికి వ్యాయామం లభించినట్లవుతుంది. 500 నుంచి 800 క్యాలరీల శక్తి కరుగుతుంది. ఇది ఒంటికి ఎంతో ఉపయోగం. గుర్రపు స్వారీ చేయడం వల్ల సరదాగా ఉంటుంది... మరోవైపు వ్యాయామం చేసినట్లు ఉంటుంది. దీని వల్ల ఫిట్‌గా తయారవుతాం' అని చెబుతోంది ఈ చిన్నది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top