'షోలే 'సినిమాలో ఓ చిన్న తప్పు దొర్లింది... అది మీరు కనిపెట్టారా?


'ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చూసుంటారు 'షోలే' సినిమాను..?'
'రెండుసార్లు.. కాదు కాదు.. మూడుసార్లు. అబ్బో లెక్కలేనన్నిసార్లు. వద్దులే ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గుర్తొస్తే మళ్లీ డీవీడీ వేసుకుని చూస్తేకానీ మనసు ఊరుకోదు..'


కోట్ల మంది భారతీయుల గుండెల్లో ఇప్పటికీ ఫిలిమక్షరాలతో నిలిచిపోయిన ఆ సినిమా పేరెత్తితే చాలు. ఇలాంటి ముచ్చట్లే వినిపిస్తాయి. అసలు విషయం ఏమిటంటే-

కొన్నేళ్ల నుంచి అందరూ ఇన్నేసిసార్లు చూస్తున్న ఆ గొప్ప
సినిమాలో ఓ చిన్న తప్పు దొర్లింది... ఒక్కరైనా కనిపెట్టారా..? అంటే గిర్రున రీలు వెనక్కి తిప్పి.. గబ్బర్‌సింగ్, జై, వీరు, ఠాకూర్.. ఒక్కొక్కరి మధ్య ఏం జరిగిందో సీన్ బై సీన్ టకటకా చెప్పేవాళ్లున్నారు. కానీ, జరిగిన మిస్టేక్ మాత్రం చెప్పలేరు. ఆ మిస్టేక్‌ను కనిపెట్టినతను గబ్బర్‌సింగ్‌ను చావబాదిన హీరోలా ఫీలయిపోతున్నాడట! ఇప్పటికీ ఆ హీరో ఎవరో మనకు తెలియదు కానీ, కనుక్కున్న కొత్త విషయాన్ని మాత్రం నెట్‌లో పెట్టేశాడు.

ఇంతకూ మిస్టేక్ ఏమిటంటే- సినిమాలో ఠాకూర్ (సంజీవ్‌కుమార్) చేతులు రెండూ నరికేస్తాడు గబ్బర్‌సింగ్. దీంతో ఎలాగైనాసరే గబ్బర్‌సింగ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటాడు ఠాకూర్. దాని కోసం జై, వీరూ (అమితాబ్‌బచ్చన్, ధర్మేంద్ర)ల సాయం తీసుకుంటాడు. ఆఖర్న గబ్బర్‌సింగ్‌ను కొట్టి కసి తీర్చుకుంటాడు ఠాకూర్. ఆ సన్నివేశాల్లో ఠాకూర్ చేతులు లేనివాడిగా నటించాడు. కాని పట్టి చూస్తే ఠాకూర్ తెల్లటి చొక్కా కింద ఒక చేయి రవ్వంత కనిపిస్తుందట. సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ తీసిన రమేష్ సిప్పీకి ఈ విషయం తెలుసో లేదో మరి!  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top