ఆహారం తక్కువ తీసుకున్న కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావాలంటే......

భోజనంపైనే దృష్టి - భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా కంపెనీ ఉన్నా, టీవీ చూస్తూ తిన్నా తెలియకుండా లాగించేస్తూనే ఉంటారు. ఎంత తిన్నారో తెలియకుండా తినేస్తారు. కాబట్టి భోజనం చేస్తున్నప్పుడు ఫుడ్‌పైనే దృష్టి పెట్టాలి. అప్పుడే కడుపు నిండిన ఫీలింగ్ త్వరగా వస్తుంది. నమలితినాలి - రుచికరమైన ఆహారాన్ని వాసన చూడాలి. ఆ తరువాత రుచి చూడాలి. రుచి చూడటం వల్ల తృప్తినందించే సంకేతాలు విడుదలవుతాయి. తరువాత బాగా నమలాలి. తృప్తినందించే సంకేతాలను మెదడుకు పంపడానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమవుతాయి. ఇవి ఆహారం బాగా నమలడం వల్ల విడుదలవుతాయి.
  • సూప్‌లు, కార్న్ - తినాలనిపించినపుడు ఫుడ్ ఐటమ్స్‌కు బదులుగా వెజిటబుల్ సూప్ తీసుకోవడం, కరకరలాడే పదార్థాలకు బదులుగా పాప్‌కార్న్ తీసుకోవాలి. ఆహారంతో పాటు గాలి, నీరు వెళ్లేలా చూడటం ద్వారా కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
  • ప్రొటీన్ ఆహారం - ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారా? అయితే కడుపు నిండిన ఫీలింగ్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
  • సరిపడా నిద్ర - శరీరానికి సరిపోయే నిద్ర లభించనప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా, లెప్టిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్లు ఆకలిని నియంత్రించడంలో తోడ్పడతాయి. పొట్టలో గ్రెలిన్ ఎక్కువగా ఉత్పత్తి అయినపుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. లెప్టిన్ ఆకలిని తగ్గిస్తుంది.
  •  తగినంత నీరు - ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఆకలి వేసినపుడు కూడా నీరు తాగటానికి చాలా మంది ఇష్టపడరు. దప్పికగా ఉన్నప్పుడు మాత్రమే నీరు తాగుతారు. భోజనానికి ముందు ఒకటిరెండు గ్లాసుల నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
  • చిన్న ప్లేట్ - భోజనానికి చిన్న ప్లేట్‌ను తీసుకోవాలి. కొందరికి రెండు, మూడు సార్లు పెట్టుకుంటే తప్ప కడుపు నిండా తిన్నామనే ఫీలింగ్ రాదు. అలాంటప్పుడు చిన్న ప్లేట్ ఉపయోగిస్తే భోజనం కొద్దికొద్దిగా పెట్టుకునే వీలుంటుంది.
  • మెల్లగా తినే ఆహారం - తినడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. కార్న్, చేపలు వంటి ఆహారం తినడానికి ఎక్కువ సమయం పడుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ త్వరగా కలుగుతుంది.
  • భోజనానికి ముందు ఆపిల్ - భోజనానికి ఇరవై నిమిషాల ముందు ఒక ఆపిల్ తినడం ద్వారా ఫుడ్ పరిమాణాన్ని బాగా తగ్గించుకోవచ్చు. ఫ్రూట్స్‌లో ఉండే ఫైబర్ మీ కడుపును నింపేస్తుంది.
  • న్యాచురల్ ఫుడ్ - న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. బేకరీ ఐటమ్స్ జోలికి వెళ్లకూడదు. ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు. ఎక్కువ సేపు నమిలి తినడం వల్ల కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top