మొక్కజొన్న టిక్కీ


కావల్సినవి: 
మొక్కజొన్న గింజలు - అరకప్పు, బంగాళాదుంపలు- రెండు, ఉల్లిపాయ ముక్కలు - రెండు కప్పులు, క్యాప్సికం ముక్కలు - కప్పు, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - మూడు, ఉప్పు - తగినంత, నూనె - అరకప్పు.

తయారీ: 
 బంగాళాదుంపల్ని ఉడికించి చల్లారాక పొట్టుతీసి చేత్తో మెత్తగా చేసుకోవాలి. నీళ్లు లేకుండా మొక్కజొన్న గింజల్ని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇందులో బంగాళాదుంప ముద్ద, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, అల్లం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. పొయ్యిపై పెనం పెట్టి ఈ మిశ్రమాన్ని టిక్కీ మాదిరి చేసుకుని నూనెతో కాల్చాలి. బంగారు వర్ణంలోకి మారాక తీసేస్తే చాలు. మొక్కజొన్న టిక్కీ సిద్ధమయినట్టే. టమాటాసాస్‌ లేదా పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top