మధ్యాహ్నం నిద్ర తో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఆఫీసులో, వ్యాపార సముదాయాల్లో, స్కూళ్లలో... ఎక్కడైనా మధ్యాహ్నం లంచ్ చేయగానే కునికిపాట్లు పడే వారిని మనం చూస్తూనే ఉంటాం. రాత్రి బాగానే పడుకున్నా మధ్యాహ్నం నిద్ర వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే చిన్న చిన్న చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
* లంచ్ హెవీగా కాకుండా సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. పెరుగన్నం తినకుండా ఉంటే మరీ మంచిది.
* లంచ్ పూర్తికాగానే ఆఫీసు చుట్టూ ఒక రౌండ్ వాకింగ్ చేయండి. ఒకవేళ మీ సీటు నుంచి బయటకు కదలడానికి వీల్లేని పరిస్థితి అయితే చిన్నపాటి డెస్క్ ఎక్సర్‌సైజులు చేయండి.
* వ్యాపారం చేసుకునే వారు లంచ్ పూర్తికాగానే కూర్చోకుండా పది నిమిషాల పాటు తిరగడం, సామాన్లు సర్దడం లాంటి పనులు చేసుకోండి.
* మొబైల్ గానీ, ఐపాడ్ గానీ ఆన్ చేసి కాసేపు మ్యూజిక్ వినండి. రాక్ ఎన్ రోల్, ఇనుస్ట్రుమెంటల్ ట్రాక్స్, లవ్‌సాంగ్స్ ఏవైనా... నచ్చినవి కాసేపు విని ఎంజాయ్ చేయండి.
* కడుపు నిండా కాఫీ తాగితే నిద్రపోతుందనుకుంటే పొరపాటు. కాకపోతే గ్రీన్ టీ తీసుకోవచ్చు.

* చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే నిద్ర మత్తు పోతుంది. ముఖం కడుక్కోవడం ద్వారా మళ్లీ ఫ్రెష్‌గా పనిలో నిమగ్నం కావచ్చు. స్త్రీలు వీలైతే మరొకసారి మేకప్ వేసుకోవచ్చు.
* డెస్క్ దగ్గర నీట్‌గా సర్దుకోవాలి. ఫైల్స్, కాగితాలు చిందరవందరగా ఉంటే పనిలో ఉత్సాహం ఉండదు.

* లంచ్ తరువాత తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులను ముందే రాసిపెట్టుకోవాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top